📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Hyderabad: మధ్యతరగతి ప్రజలకు రేవంత్ రెడ్డి బంపర్ ఆపర్

Author Icon By Rajitha
Updated: February 10, 2026 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో పేద, అల్ప ఆదాయం, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నిజం చేయడానికి రేవంత్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి పట్టణాల్లో తక్కువ ధరకే ఇళ్లను అందుబాటులోకి తెచ్చే దిశగా ఎఫర్డబుల్ హౌసింగ్ పాలసీని రూపొందిస్తోంది. నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, ఈ నిర్ణయం మిడిల్ క్లాస్ కుటుంబాలకు పెద్ద ఊరటగా మారనుంది. అద్దె భారం తగ్గించి సొంతింటి భద్రత కల్పించడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.

Read also: FarmApp: వ్యవసాయ యంత్రాల బుకింగ్ కోసం కొత్త యాప్

Revanth Reddy’s bumper offer for the middle class people

హౌసింగ్ పాలసీ రూపకల్పన – కీలక దశలు

ఫిబ్రవరి నెలాఖరులోగా మార్గదర్శకాల ముసాయిదాను సిద్ధం చేసి, మార్చి చివరి నాటికి తుది పాలసీని రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం CBRI కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేసి, గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో విస్తృత చర్చలు జరిపారు. కేబినెట్ ఆమోదం అనంతరం కొత్త ఆర్థిక సంవత్సరంలోనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను పీపీపీ విధానంలో అమలు చేయనున్నారు.

మూడు దశల్లో ఇళ్ల నిర్మాణం – మిడిల్ క్లాస్‌కు ఊరట

మొత్తం మూడు దశల్లో ఈ గృహ సముదాయాలను నిర్మించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మురికివాడల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి, అక్కడి ప్రజలకు సొంత ఇళ్లు అందించనున్నారు. అలాగే హైదరాబాద్ Hyderabad ఫోర్త్ సిటీగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలోనూ భారీ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. టైర్-2 పట్టణాల్లో ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల టవర్లు నిర్మించి, లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ మరియు మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ కుటుంబాలకు సరసమైన ధరలకు అందించాలనే ప్రణాళిక రూపొందించారు. ఈ నిర్ణయంతో మధ్యతరగతి ప్రజల్లో ఆశలు మరింత పెరిగాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Affordable homes Hyderabad Real Estate latest news Middle class news Revanth Reddy Telangana housing Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.