📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Hyderabad: గ్రేటర్లో ఇళ్ల నిర్మాణదారులకు తీపికబురు

Author Icon By Sharanya
Updated: July 12, 2025 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అందుబాటులోకి నాలుగు ఇసుక రీచ్ లు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) లో ఇసుక కొరత తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టిఎస్ఎం డిసి) కొత్తగా నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించింది. సన్న ఇసుక టన్ను రూ.1800, దొడ్డు ఇసుక రూ. 1600 చొప్పున విక్రయిస్తున్నారు.

ఇసుక కొరతకు కీలక చర్యలు


రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లి, అబ్దుల్లాపూర్ మెట్, ఆదిభట్ట, మేడ్చల్ జిల్లాలోని భౌరంపేటలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల రీచ్ల నుంచి ఇసుక వస్తుండగా వర్షాకాల కొరతను ఈ బజార్లు తీరుస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టే వారికి నిజంగా ఇది శుభవార్తే. ఇసుక కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (TSMDC) కీలక చర్యలు చేపట్టింది. భారీ నిర్మాణదారులకు, వ్యక్తిగత విని యోగదారులకు ఇసుకను సులభంగా అందు బాటులోకి తెచ్చేందుకు నాలుగు కొత్త ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది. నిర్మాణ రంగంలో ఎదురవుతున్న ఇసుక కొరత (Scarcity of sand) సమస్యకు ఒక పరిష్కారంగా మారనుందని అధికారులు తెలిపారు.


ఈ నూతన ఇసుక బజార్లలో సన్న ఇసుకను టన్ను రూ.1800కు, దొడ్డు ఇసుకను రూ. 1600కు విక్రయిస్తున్నట్లు గోళీలీదీది ప్రకటిం చింది. ప్రస్తుతం ఈ ఇసుక బజార్లు రంగారెడ్డి జిల్లాలోని వట్టి నాగులపల్లి, అబ్దుల్లా పూర్మెట్, ఆదిభట్ట, మేడ్చల్ జిల్లాలోని బౌరంపేటలో అందుబాటులో ఉన్నాయి. ఈ అన్ని ఇసుక బజార్లలో నాణ్యమైన నదీ ఇసుక సరిపడా నిల్వ ఉందని, వ్యక్తిగత వినియోగదారులు, కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థల అవసరాలను తీర్చగలిగేలా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో హైద రాబాద్ నగరంలో పరిసర ప్రాంతాల్లో ఇసుక కొరత నిర్మాణ రంగంలో పెద్ద సమస్యగా మారింది. ఇసుక సరఫరాలో జాప్యం, అధిక ధరలు, అక్రమ రవాణా వంటి సమస్యల వల్ల నిర్మాణ ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి. దీనివల్ల నిర్మాణ వ్యయం పెరిగి, వినియోగ ఇదారులపై భారం పడుతోంది. నగరానికి ఇసుక ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల రీచ్ల నుంచి వస్తుంది. వర్షాకాలంలో నదీ రీచ్లలో తవ్వకాలు నిలిచిపోవడం కూడా కొరతకు ఒక కారణం. ఈ నేపథ్యంలో ఇసుక బజార్ల ఏర్పాటు నిర్మాణ రంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుం దని అధికారులు భావిస్తున్నారు. వినియోగ దారులు టిఎస్ఎండిసి సాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం లేదా సందేహాల నివృత్తి కోసం విని యోగదారులు టిఎస్ఎండిసి, హెల్ప్ లైన్ నంబర్ 155242ను సంప్రదిం చవచ్చు.. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు, నిర్మాణదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ విజప్తి చేసింది. ఇది ఇసుక లభ్యతను మెరుగుపరచి, నిర్మాణ రంగానికి ఊతమిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Seethakka: మహిళా స్వయం సహాయక కేంద్రాలకు రూ.344 కోట్లు వడ్డీలేని రుణాలు: మంత్రి సీతక్క

Breaking News GHMC Permissions House Construction GHMC Hyderabad Builders News Hyderabad Real Estate latest news Sand reaches Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.