Hyderabad Real Estate: బడ్జెట్ తర్వాత రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు మంచి జరిగేనా?

Read Time:  1 min
Hyderabad Real Estate: బడ్జెట్ తర్వాత రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు మంచి జరిగేనా?
FONT SIZE
GET APP

Hyderabad Real Estate: ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో హైదరాబాద్ విస్తరణకు సంబంధించిన పలు ప్రణాళిలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పునర్వ్యవస్థీకరణ నుండి ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం వరకు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నగరం నలుమూలలా రియల్ ఎస్టేట్ వృద్ధికి కొత్త ఊపిరి పోయనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఎలాంటి మార్పులు ఉండొచ్చంటే..

Read Also: wars: యుద్ధాలతో తల్లడిల్లుతున్న ప్రపంచం

Hyderabad Real Estate: బడ్జెట్ తర్వాత రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు మంచి జరిగేనా?
Hyderabad Real Estate: Will things get better for real estate investors after the budget?

ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్లు రెట్టింపు అయ్యే అవకాశం

ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ , మల్కాజ్‌గిరి అనే మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించాలని నిర్ణయించింది. ముచ్చర్ల సమీపంలో 30,000 ఎకరాల విస్తీర్ణంలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. బడ్జెట్‌లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను అనుసంధానించడం ద్వారా రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. హైదరాబాద్‌ను కాలుష్య రహిత (Net Zero) నగరంగా మార్చడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అలాగే చెరువులు, కుంటల రక్షణ కోసం ‘హైడ్రా’కు కొత్త చట్టబద్ధమైన అధికారాలను కల్పించింది.

మొత్తంగా చూస్తే తెలంగాణ బడ్జెట్ 2026 హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిదని చెప్పవచ్చు. ప్రభుత్వం కేవలం నగర మధ్యభాగంపైనే కాకుండా, 30,000 ఎకరాల భారీ ప్రాజెక్టులతో శివారు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించింది. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా నిలబెట్టాలనే లక్ష్యం నెరవేరితే, రాబోయే ఐదేళ్లలో ఇక్కడి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్లు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.