📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Hyderabad Police: న్యూ ఇయర్ అలర్ట్: ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్ పూర్తిగా బంద్

Author Icon By Tejaswini Y
Updated: December 31, 2025 • 12:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నూతన సంవత్సర వేడుకలు(New Year Celebrations) సురక్షితంగా, ప్రశాంతంగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) విస్తృత స్థాయి భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజామున వరకు నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణలు అమలు చేయనున్నారు. ఈ ఆంక్షలు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 2 గంటల వరకు కొనసాగుతాయని ట్రాఫిక్ ఉన్నతాధికారులు తెలిపారు.

Read Also: Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్?

రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసుల నిఘా మరింత పెంచారు. బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్లకు మినహాయింపునిస్తూ, మిగతా ఫ్లైఓవర్లను పరిస్థితుల్ని బట్టి రాత్రి 10 గంటల తర్వాత మూసివేయనున్నట్లు ప్రకటించారు. నగరంలోకి ప్రవేశించే ప్రైవేటు వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మళ్లించనున్నారు.

Hyderabad Police: New Year Alert: Tankbund, Necklace Road completely closed

ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్

ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో రాత్రి 11 నుంచి 2 గంటల మధ్య వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. ప్రజల భద్రత కోసం నగరవ్యాప్తంగా 217 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహించనున్నారు.

పబ్‌లు, షాపింగ్ మాల్స్, పార్టీ

పబ్‌లు, షాపింగ్ మాల్స్, పార్టీ కేంద్రాలుగా మారే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుంది. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే వినియోగించాలంటే విమాన టికెట్ చూపించడం తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు.

మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు

మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 8 గంటల నుంచే ప్రారంభమవుతాయని, ర్యాష్ డ్రైవింగ్‌, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలను సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Hyderabad Police Hyderabad Traffic New Year Celebrations New Year Traffic Restrictions traffic diversions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.