📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Hyderabad: పార్కింగ్ గొడవ ఓ ప్రాణాన్ని బలికొంది

Author Icon By Sharanya
Updated: May 30, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చైతన్యపురి ఠాణా పరిధిలో ఘోరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట ప్రాంతంలోని వైష్ణవి రుతిక అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ వివాదంలో జ‌రిగిన గొడ‌వ ఒక‌రి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఇప్పుడు ఆ అపార్ట్‌మెంట్ వాసుల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఘటనా వివరాలు:

2025 మే 21న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గండ్ర నాగిరెడ్డి గత 13 ఏళ్లుగా తన కుటుంబంతో కలిసి కొత్తపేటలోని వైష్ణవి రుతిక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. అదే అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబ‌ర్-402లో అద్దెకు ఉంటున్న సూరి కామాక్షి ఇంటికి ఆమె అల్లుడు కృష్ణ జివ్వాజి వ‌చ్చారు. ఆయ‌న త‌న కారును అపార్ట్‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో పార్క్ చేశాడు. గండ్ర నాగిరెడ్డి బ‌య‌ట నుంచి వ‌చ్చి త‌న కారును కృష్ణ కారు వెనక నిలిపాడు. కృష్ణ జివ్వాజి తిరిగి వెళ్లేందుకు కిందికి రాగా త‌న కారుపై గీత‌లు క‌నిపించాయి. అందుకు నాగిరెడ్డి (Nagireddy) కార‌ణ‌మ‌ని, వాచ్‌మెన్‌తో అత‌డిని కిందికి ర‌ప్పించి దాడి చేశాడు. దాంతో నాగిరెడ్డి చెవిలోంచి ర‌క్తం, నోటిలోంచి నురుగ వ‌చ్చి ప‌డిపోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ, అప్ప‌టికే అత‌డు మృతిచెందిన‌ట్టు వైద్యులు తెలిపారు.

నిందితుడు పరారీ

ఈ సంఘటన జరిగిన అదే రోజు రాత్రి మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, అప్పటికే నిందితుడు కృష్ణ జివ్వాజి (KrishnaJivvaji) పరారయ్యాడు. కామాక్షి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిపోయింది. పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై అపార్ట్‌మెంట్ వాసులు అసహనం వ్యక్తం చేశారు. కేసు జరిగినా, దాని వివరాలను మీడియాకు వెల్లడించకపోవడమే కాకుండా, నిందితుడిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడాన్ని వారు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.

మృతుని అంత్యక్రియలు

పోస్టుమార్టం అనంత‌రం కుటుంబ స‌భ్యులు నాగిరెడ్డి మృతదేహాన్ని స్వ‌గ్రామానికి తీసుకెళ్లి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రమైన విషాదంలో మునిగిపోయారు. పార్కింగ్ గొడవ ఒక ప్రాణం తీసిన ఈ ఘటన సమాజానికి తీవ్ర గమనిక. చిన్న విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించకుండా, హింసారూపంలోకి మలచడం భయంకరమైన ఫలితాలను తేలుస్తోంది.

Read also: Local Body Elections : జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు?

#crimenews #HyderabadCrime #HyderabadNews #Kothapet #ParkingDispute #ParkingIssue #telangana Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.