నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనర్(V.C. Sajjanar) సేవా కార్యక్రమాలతో తన ఏడాదిని ప్రారంభించారు. (Hyderabad) కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆయన, అక్కడి వృద్ధులతో సమయాన్ని గడిపారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వారితో కలిసి కొత్త ఏడాది వేడుకలను జరుపుకున్నారు. వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడున్న 48 మంది వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
Read also: NEW YEAR 2026: ఆల్కహాల్ రీడింగ్ చూసి పోలీసులు అవాక్కు
ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో సజ్జనార్ సందర్శన
అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలను కూడా ఆయన పరామర్శించారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాను కార్ఖానలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించినట్లు ‘ఎక్స్’ వేదికగా సజ్జనార్ తెలిపారు. (Hyderabad) నూతన సంవత్సర వేడుకలంటే కేవలం సంబరాలు, హంగులే కాదు. ఆత్మీయతను పంచుకోవడం, బాధ్యతను గుర్తుచేసుకోవడం. ఇదే సంకల్పంతో ఈ ఏడాది తొలి రోజును నిరాడంబరంగా, సేవా దృక్పథంతో ప్రారంభించాను. అని ఆయన పేర్కొన్నారు. అక్కడే అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలను పరామర్శించినట్లు తెలిపారు. పావలా శ్యామల కష్టకాలంలో స్పందించి ఆమెను హెల్త్ కేర్ సెంటర్‌లో చేర్పించారంటూ తిరుమలగిరి ఏసీపీ రమేశ్‌ను అభినందించారు. ఆర్కే ఫౌండేషన్ గురించి మాట్లాడుతూ, డాక్టర్ రామకృష్ణ 18 ఏళ్లుగా వేలాదిమందికి ఉచిత వైద్యం, ఆశ్రయం కల్పిస్తున్నారని, ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలని, తల్లిదండ్రులను భారంగా కాకుండా బాధ్యతగా చూసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: