📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Hyderabad: కూతురికి విషం ఇచ్చి ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి

Author Icon By Sharanya
Updated: April 20, 2025 • 3:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ నగర శివారులోని బాచుపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రగతినగర్‌లోని ఆదిత్య గార్డెన్స్ హరిత ఆర్కేడ్ అపార్ట్మెంట్స్‌లో నివసిస్తున్న నంబూరి కృష్ణ పావని అనే గృహిణి తన నాలుగేళ్ల కుమార్తె జశ్వికకు విషం ఇచ్చి, తాను కూడా తాగిన విషాదకర ఘటన 18వ తేదీన సాయంత్రం చోటు చేసుకుంది.

ఘటన వివరాలు

ఈ ఘటనలో చిన్నారి జశ్విక (4) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తల్లి కృష్ణ పావని (32) ప్రస్తుతం ఐసీయూ లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంబశివ రావు అనే వ్యక్తి, తన భార్య కృష్ణ పావని, కుమార్తె జశ్వికతో కలిసి నివసిస్తున్నాడు. సంఘటన జరిగిన సమయంలో సాంబశివ రావు ఇంట్లో లేని సమయాన్ని కృష్ణ పావని, తమ కూతురు జశ్వికకు మజాలో ఎలుక మందు తాగించి ఆ తర్వాత తాను తాగింది . శనివారం తెల్లవారుజామున తన భర్తకు ఈ విషయాన్ని తెలపడంతో, అతను వెంటనే ఇంటికి వచ్చి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించాడు. బాచుపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, కృష్ణ పావని అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని తెలుస్తోంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు భావిస్తున్నారు. అయితే, అంతిమంగా పూర్తి విచారణ తరువాతే అసలు కారణాలు స్పష్టమవుతాయి. చిన్నారి జశ్విక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆమెపై ఐపీసీ సంబంధిత సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read also: Bhatti Vikramarka: హెచ్‌సీయూ విద్యార్థుల కేసుల తొలగింపుపై..భట్టి చెప్పినవి వట్టి మాటలేనా?

#FamilyCrisis #HyderabadNews #MotherAndChild #SadReality #shockingincident #telangana Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.