📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Mock Drill : హైదరాబాద్‌లో నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్

Author Icon By Digital
Updated: May 8, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లో నాలుగు చోట్ల మాక్ డ్రిల్ – కొత్వాల్ ఆనంద్ పర్యవేక్షణ

పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా అప్రమత్తత చర్యలలో భాగంగా కేంద్రం సూచనలతో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్‌లో నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ జరిగింది. సంక్షోభ సమయంలో ప్రజలు ఎలా స్పందించాలో, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అధికారులు తీసుకునే చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈ డ్రిల్ నిర్వహించారు.మాక్ డ్రిల్‌కు ముందు సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి, దీని ఉద్దేశాలను వివరించారు. ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం సికింద్రాబాద్, గోల్కొండ కంటోన్మెంట్, కంచన్‌బాగ్‌ (రక్షణ రంగ పరిశోధనా సంస్థల ప్రాంతం), కుషాయిగూడ (ఆణుపరిశోధనా కేంద్రం ఉన్న ప్రాంతం)లలో మాక్ డ్రిల్ చేపట్టారు.సాయంత్రం నాలుగు గంటలకు ఆయా ప్రాంతాల్లో సైరన్లు మోగడంతో మాక్ డ్రిల్ ప్రారంభమైంది. వెంటనే ప్రజలు పోలీసుల సూచనలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడం, గ్యాస్ స్టవ్‌లు ఆపివేయడం వంటి చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక, పోలీస్, రక్షణ శాఖలు, సివిల్ డిఫెన్స్ విభాగాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రజలకు వైమానిక దాడులు జరిగినట్లుగా వివరించి, తగిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.

Mock Drill : హైదరాబాద్‌లో నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్

Mock Drill : హైదరాబాద్‌లో నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్

డ్రిల్ సమయంలో కొందరు గాయపడినట్లు అనుకరించి, వారిని అంబులెన్స్లలో ఆసుపత్రులకు తరలించడమన్నది ప్రాక్టికల్‌గా ప్రదర్శించారు. ఈ కార్యక్రమం సుమారు అరగంట పాటు కొనసాగింది. నాలుగు ప్రాంతాల్లో కూడా సాయంత్రం నాలుగు నిమిషాలకు సైరన్ మోగించడంతో మాక్ డ్రిల్ ముగిసింది.ఈ మొత్తం చర్యను బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కొత్వాల్ ఆనంద్ స్వయంగా పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను సమీక్షించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, తదుపరి కొన్ని రోజులపాటు సంబంధిత విభాగాల్లో ఎవరూ సెలవులు తీసుకోకూడదని తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య విభాగం తగిన విధంగా సిద్ధంగా ఉండాలన్నారు. ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితులకు ఔషధాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ వంటి విభాగాలు తమ పరికరాల పనితీరును పరిశీలించి సవ్యంగా పని చేయగలుగుతున్నాయా అన్నది నిర్ధారించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో రక్షణ శాఖకు చెందిన అనేక విభాగాలు ఉన్నందున భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. జంట నగరాల్లో ఉన్న పాక్ పౌరులను వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని, బంగ్లాదేశీయులను కూడా బయటకు పంపిస్తామని తెలిపారు.భద్రతా దళాలకు సంఘీభావంగా గురువారం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్రం ముందస్తుగా ప్రకటించిన మాక్ డ్రిల్ బుధవారం దేశవ్యాప్తంగా సజావుగా సాగిందని, ప్రజల్లో చైతన్యం కల్పించడంలో ఇది స్ఫూర్తిదాయకమైందని అధికారులు భావిస్తున్నారు.

Read More : Rtc Strike : తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలిక వాయిదా

#telugu News civil defense CV Anand emergency preparedness fire service Google news Google News in Telugu Hyderabad News mock drill NDMA NDRF Pahalgam Attack Paper Telugu News SRF telangana police Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.