హైదరాబాద్(Hyderabad) (చిక్కడపల్లి) : ముషీరాబాద్ నియోజకవర్గంలో భోలక్ పూర్, గుల్షన్ నగర్లో బుధవారం రాత్రి ఒక స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో మొదలైన మంటలు వేగంగా పక్కనే ఉన్న ప్లాస్టిక్, వైట్ల గోదాములకు విస్తరించడంతో ప్రజలు, చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు ఒక్కరి భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు.
Medak News : మెదక్‌లో మెడికల్ అసోసియేషన్ నూతన భవనానికి భూమిపూజ , ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
సమాచారం అందుకున్న వెంటనే ముషీరాబాద్ ఫైర్ ఆఫీసర్ పి.దత్తు నేతృత్వంలో ఎగిసిపడుతున్న మంటలను తీవ్రంగా కృషి చేసి అదుపులోకి తీసుకువచ్చారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎగిసిపడుతున్న మంటలు ఆర్పివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ముషీరాబాద్ ఫైర్ స్టేషన్(Musheerabad Fire Station) సిబ్బంది హైడ్రా సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా అగ్నిప్రమాదం వల్ల కలిగే నష్టం అంచనా వేయాల్సి ఉంది. కాగా మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్మేసింది. పూర్తి వివరాలు, నష్టపరిహారం అంచనా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: