హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మహేశ్వరం ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ (Future City) ని నిర్మిస్తూ రానున్న కాలంలో ప్రపంచంలోనే 4వ నగరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మహేశ్వరం నియోజకవర్గ ప్రాంతంలో నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలియజేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇండస్ట్రీయల్ పార్కులో మలబార్ జేయ్స్ జువెలరీ తయారీ యూనిట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి శ్రీధరాబాబుతో కలిసి ప్రారంభించారు.
హైదరాబాద్ ప్రపంచంలోనే పెద్ద నగరంగా
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ, ఫార్మా తదితర రంగాల మాదిరిగానే తయారీ రంగంలోనూ తెలంగాణను హబ్ (Telangana is a hub) మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని, అందుకు అనుగుణంగా హైదరాబాద్ (Hyderabad) శివార్లలో ఎలక్ట్రానిక్ క్లస్టర్, మహేశ్వరంలో జువెలరీ తయారీ యూనిట్లు, జహీరాబాద్ ఈవీఅండ్ డిఫెన్స్ హబ్కు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా ప్రగతిపథంలో దూసుకెళ్తున్నామని, తెలంగాణ పరిశ్రమల కంటే ముందుకు వాటికి అవసరమైన ఏకో సిస్టమ్ ను నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దుతున్నామని, అది ఇదే ప్రాంతంలో ఉందని, హైదరాబాద్ (Hyderabad) నగరం ప్రపంచంలోనే పెద్ద నగరంగా అవతరిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, వాటి పెట్టుబడులకు రక్షణ కల్పిస్తామని, లాభదాయకంగా ఉండే పరిశ్రమలను పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ద్వితీయ రంగంలో (మ్యాన్ప్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్స్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా) వృద్ధి రేటు 9.6 శాతం, అదే జాతీయ సగటు 8.3 శాతం మాత్రమేనని ఆయన అన్నారు. ఈ మలబార్ జేమ్స్ అండ్ జువెలరీ సంస్థ ముందుకు వెళుతూ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందంజలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధరాబాబు మాట్లాడుతూ
ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధరాబాబు మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన మలబార్ జేమ్స్ అండ్ జువెలరీ తయారీ యూనిట్ ఈ ప్రాంతానికి రావడం తమకెంతో ఆనందంగా ఉందని, ప్రారంభించుకున్న మలబార్ తయారీ యూనిట్ తెలంగాణను తయారీ రంగంలో హబ్ అభివృద్ధికి దిక్సూచిగా తీర్చిదిద్దుతుందని ఆయన విశ్వసించారు. తెలంగాణలో ఫర్నీచర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఈ సంస్థ ముందుకు రావాలని, ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహకరిస్తామని ఆయన తెలియజేశారు. తెలంగాణ యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఇలాంటి సంస్థలు చేతులు కలపాలని ఆయన కోరారు. 2035 నాటికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్ ఎకనామిగా తీర్చిదిద్దాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మలారెడ్డి, మలబార్ గ్రూప్స్ ఛైర్మన్ ఎం.పీ.అహ్మద్, వైస్ ఛైర్మన్ సలీం, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ నిషద్ ఏకే, శాసనమండలి సభ్యులు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, స్థానిక నాయకులు కేఎల్ ఆర్ 789+తదితరులు పాల్గొన్నారు.
Read also: Congress Party : నేడు కాంగ్రెస్ ‘సామాజిక న్యాయ సమర భేరి’