📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Hyderabad: డబ్బును డిమాండ్ చేస్తూ ఇంటి యజమాని పై హిజ్రాల దాడి

Author Icon By Tejaswini Y
Updated: November 11, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad: మేడ్చల్ జిల్లాలోని కీసర మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్త ఇల్లు కట్టుకున్న వ్యక్తిపై హిజ్రాల గ్యాంగ్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, చీర్యాల్‌లోని శ్రీ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న సదానందం అనే వ్యక్తి ఇటీవల తన కొత్త ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేశారు.

ఆదివారం రోజున ఇంటి వద్ద కొన్ని చిన్న పనులు జరుగుతుండగా, ఇద్దరు హిజ్రాలు అక్కడకు వచ్చి “కొత్త ఇల్లు కట్టావు కాబట్టి లక్ష రూపాయలు ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. దీనికి సదానందం నిరాకరించడంతో, వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటికే మూడు ఆటోల్లో సుమారు 15 మంది హిజ్రాలు తిరిగి అక్కడకు చేరుకుని ఆ ఇంటిపై దాడి చేశారు.

Read Also:  Jubilee Hills: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు!

ఇంటి గేటును పగులగొట్టే ప్రయత్నం

మొదట ఇంటి గేటును పగులగొట్టే ప్రయత్నం చేసిన వారు, తర్వాత సదానందం కుటుంబ సభ్యులను భయపెట్టారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సదానందంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో చేరడంతో హిజ్రాల గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది.

దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

HijrasAttack HyderabadCrime HyderabadNews KeesaraIncident MedchalNews MedchalUpdates TelanganaBreakingNews TelanganaCrime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.