హైదరాబాద్(Hyderabad) మహానగర రూపురేఖలు మరోసారి మారేందుకు సిద్ధమయ్యాయి. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, సమగ్ర పాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర శివార్లలో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 నగర పాలక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో కలిపింది. ఈ ప్రక్రియతో సుమారు 3 వేల కాలనీల అధికారిక చిరునామాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అదే సమయంలో 100కు పైగా కొత్త డివిజన్లు కూడా ఏర్పాటు చేశారు.
Read Also: Telangana: కాంగ్రెస్ పాలనపై జల ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం?
20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనం.. 3 వేల కాలనీల చిరునామాలు మారనున్నాయి
ఈ విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు సుమారు 650 చదరపు కిలోమీటర్లకు పరిమితమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధి, తాజాగా 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం డిసెంబర్ 1న జారీ చేసింది.
విలీన ప్రక్రియతో పాటు డివిజన్ల పునర్విభజన పనులను జీహెచ్ఎంసీ అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో పూర్తి చేశారు. కొత్త డివిజన్ల(Hyderabad) హద్దులపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి అవసరమైన మార్పులు చేశారు. శివరాంపల్లిని సులేమాన్‌నగర్‌లో కలపడం వంటి అంశాలపై వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ అంశాలపై రూపొందించిన తుది నివేదికను సోమవారం ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఫైనల్ గెజిట్‌ను విడుదల చేయనుంది. ఇదిలా ఉండగా, ఇంత విస్తారమైన నగరాన్ని ఒకే పాలనా వ్యవస్థ కింద నిర్వహించడం సాధ్యమా? అన్న అంశంపై ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలను కూడా పరిశీలిస్తోంది. అవసరమైతే జీహెచ్ఎంసీని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. 2026 జనగణన పూర్తైన తర్వాత, 2027లో వెలువడే జనాభా గణాంకాల ఆధారంగా మరోసారి డివిజన్ల పునర్విభజన జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: