📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Future city: హైదరాబాద్‌ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ?

Author Icon By Vanipushpa
Updated: March 20, 2026 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. 2026-27 వార్షిక బడ్జెట్‌ లో భాగంగా సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future city)’ ని నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు అదనంగా ఇది నాలుగో నగరంగా (Fourth City) అవతరించబోతోంది. దీని ప్లానింగ్ ఎలా ఉండబోతుందంటే.. హైదరాబాద్ శివార్లలో ముచ్చర్ల ప్రాంతం కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ఈ నగరం రాబోయే తరాల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో నిర్మితం కానుంది. భారత్ ఫ్యూచర్ సిటీ కేవలం నివాస ప్రాంతంగానే కాకుండా అంతర్జాతీయ విద్యా, సాంకేతిక కేంద్రంగా మారనుంది. ఈ నగరంలో ఇప్పటికే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ ని ఏర్పాటు చేశారు. దీనికి తోడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌ ను కూడా ఇక్కడే స్థాపించబోతున్నారు. ప్రపంచ స్థాయి సంస్థలు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను (GCC) ఇక్కడ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దీనివల్ల లక్షలాది మంది యువతకు ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Read Also: North Korea: డ్రోన్‌లను తిప్పికొట్టగల కొత్త ట్యాంక్‌ను నడిపిన కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె

Future city: Is Bharat a future city next to Hyderabad?

అంతర్జాతీయ నగరాలైన సింగపూర్, దుబాయ్ తరహాలో ..

‘నెట్ జీరో’ (Net Zero) లక్ష్యంతో, కాలుష్య రహిత రవాణా వ్యవస్థను ఇక్కడ ప్రవేశపెట్టనున్నారు. 30,000 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం, సౌర శక్తి వినియోగం , శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతర్జాతీయ నగరాలైన సింగపూర్, దుబాయ్ తరహాలో ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉండబోతున్నాయి. మెట్రో కనెక్టివిటీ , స్పోర్ట్స్ విలేజ్ భారత్ ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌ లో స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా ఈ నగరానికి చేరుకునేలా మెట్రో లైన్ విస్తరణ జరగనుంది. అంతేకాకుండా, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు ఇక్కడ ఒక భారీ ‘స్పోర్ట్స్ విలేజ్’ (Sports Village), క్రికెట్ స్టేడియంను కూడా నిర్మించనున్నారు. ఇది కేవలం వ్యాపార కేంద్రంగానే కాకుండా, క్రీడలు, వినోదానికి కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. Powered By 1999 లో సర్వీస్ లోకి వచ్చా.. 20 ఏళ్లు పట్టింది గెజిటెడ్ అవ్వడానికి | Oneindia Telugu రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఉత్సాహం 30,000 ఎకరాల భారీ విస్తీర్ణంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ వల్ల దక్షిణ హైదరాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AI City Hyderabad Bharat Future City Mucherla Fourth City Telangana Future City Hyderabad Hyderabad Fourth City Location Net Zero City India Telangana Budget Live telugu Telangana Future City Master Plan 2026 Telugu News Today Young India Skill University

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.