📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Hyderabad Farmhouse Drug Parties: ఫాంహౌస్ లపై కొరవడిన నిఘా

Author Icon By Tejaswini Y
Updated: March 16, 2026 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad Farmhouse Drug Parties: హైదరాబాద్ శివార్లలోని ఫాం హౌస్లపై నిఘా కొరవడింది. నిన్నమొన్నటి వరకు మద్యంతో డ్యాన్స్లు, మహిళల అశ్లీల నృత్యాలతో కూడిన రేవ్ పార్టీల వరకే పరిమితమైన ఫాం హౌసేలు కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలకు కేరాఫ్ గా మారాయి. ఈ పార్టీలో ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు, చట్టసభల్లో సభ్యులుగా వున్న వారు పాల్గొనడంతో పాటు డ్రగ్స్ సేవించి దొరికిపోవడం సందలనం రేపుతోంది. ఇంతకు ముందు జంట నగరాలలోని పబ్లలో డ్రగ్స్ సేవించి దొరికిపోయిన వారు అనేక మంది వుండగా ఇప్పుడు ఫాం హౌసలలో ఈ తరహా ఘటనలు ఎక్కువవుతున్నాయి.

Read Also: NMC: స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

Hyderabad Farmhouse Drug Parties: Lack of surveillance on farmhouses

శివార్లలోని మొయినాబాద్లో గల అజీజ్నాగర్లో బిఆర్ఎన్ నాయకుడు, మాజీ ఎంఎల్ఎ ఫైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్లో శనివారం రాత్రి డ్రగ్స్ పార్టీని పోలీసులు రట్టుచేయగా ఈ సందర్భంగా ఏలూరు ఎంపి వుట్టా మహేష్ యాదవ్ తో పాటు రోహిత్ రెడ్డి సహా ఆరుగురు మాదకద్రవ్యాలు సేపించి దొరికిపోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఫాం హౌసేలు నిన్నటి వరకు ఒక స్టేటస్ సింబల్ గా వుండేవి. కానీ నేడు ఇవి ఆరాచక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. ఫాం హౌస్లలో ఇటీవల కాలంలో డ్రగ్స్ పార్టీలు అనేకం రట్టవగా ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న పలువురు మాదకద్రవ్యాలు సేవించి పోలీసులకు దొరికిపోరు.

ఏడాది క్రితం శంకర్పల్లిలో ప్రముఖుడి ఫాం హౌస్లో ఒక నాయకుడి జన్మదిన వేడుకలు జరపగా అర్థరాత్రి వాటిన తరువాత కూడా సంగీతం హోరెత్తడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడిచేశారు. ఈ సందర్భంగా కొందరు గంజాయి సేవించిన స్థితిలో దొరికిపోయారు. నాలుగు నెలల క్రితం ప్రముఖ గాయని జన్మదిన వేడుకలు ఇవే ప్రాంతంలో జరగగా ఈ పార్టీపై పోలీసులు దాడిచేయగా కొందరు గంజాయి తీసు కుని పట్టుబడ్డారు. అంతకు ముందు రాయదుర్గంలో జరిగిన
మరో పార్టీలో ఓ ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి బంధువు సహా పలువురు గం జాయి సేవించి పట్టుబడ్డారు.

ప్రముఖులతోపాటు ప్రజాప్రతినిధులు

ఫాం హౌసేలు ఎక్కువగా వున్న శంకర్పల్లి, మోకిల, మొయినాబాద్, అజిజ్నాగర్లో పార్టీలు ఎక్కువగా జరుగుతుం డగా మెకారెటీ పార్టీల్లో డ్రగ్స్ వాడకం వుండని పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ పార్టీలకు వస్తున్న వారిలో రాజకీయ రంగానికి చెందిన వారితో పాటు సినీ రంగం వారు ఎక్కువగా వుంటున్నారు. వీరితో పాటు రియల్టర్లు కూడా వుంటున్నారు. ఇటీవల దుబాయ్ లో ఓ బాలీవుడ్ నిరా స్థిత అనుమానాస్పదస్థితిలో మరణించగా ఆయన డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మరణించాడని ఆరోపణలు వచ్చాయి. కాగా అంతకు ముందు మరో నిర్మాత సైబరాబాద్ పోలీసులకు డ్రగ్స్ తో పట్టుబడగా ఆయన ఆరు నెలల క్రితం గోవాలో ఆత్మహత్యకు పాల్పడడం
నిన్నటి వరకు లిక్కర్ డ్యాన్స్ లు , రేవ్ పార్టీలు నేడు డ్రగ్స్ పార్టీలతో హల్చల్. ప్రముఖులతోపాటు ప్రజాప్రతినిధులు వరుసగా పట్టుబడుతున్న వైనం సంచలనం రేపింది. టాలీవుడ్ కు చెందిన ద్వితీయ శ్రేణీ. హీరోలు పలువురు డ్రగ్స్ తో పట్టుబడ్డ ఉదంతాలు అనేకం వుండడం గమనార్హం.

గోవాసహా ఉత్తరాది ముఠాలకు లింకులు

ఇదిలావుండగా హైదరాబాద్ శివార్లలోని ఫాం హౌస్ లలో వెలుగుచూస్తున్న డ్రగ్స్ పార్టీల వెనుక గోవాతో పాటు ఉత్తరాది డ్రగ్స్ ముఠాల హస్తం వుందని. పోలీసుల విచారణలో తేలడం గమనార్హం. గోవాకు చెందిన అనేక మంది డ్రగ్స్ స్మగర్లు హైదరాబాద్ పాటు మల్కాజిగిరి, సైబరాబాద్ పో లీసులకు పట్టుబడ్డారు. గతంలో వీరంతా నగరంలోని పబ్లిక్కు డ్రగ్స్ సరఫరా చేసేవారు ఇప్పుడు ఫాం హౌస్లలో జరిగే పార్టీలకు అందిస్తున్నారు. తాకా ఘటన నేపథ్యంలో ఫాం హౌస్లపై నిఘా కఠినతరం చేయాల్సిన అవసరం వుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aziz Nagar Farmhouse Case Hyderabad Farmhouse Drug Parties Hyderabad Farmhouse Drugs Moinabad Drug Raid

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.