📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Electric shock: కరెంటు షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి

Author Icon By Sharanya
Updated: August 19, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ నగరంలో వరుసగా విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బండ్లగూడ (Bandlaguda) ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని తరలించే సమయంలో కరెంటు షాక్ (Electric shock) తగిలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

హైటెన్షన్ వైర్లను తాకిన విగ్రహం

వివరాల ప్రకారం, కొందరు యువకులు భారీ వినాయకుడి విగ్రహాన్ని (idol of Lord Ganesha) ట్రాక్టర్‌పై ఎక్కించి మండపానికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌పై ఉన్న విగ్రహం పొరపాటున హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో ఘోర ప్రమాదం జరిగింది.

Electric shock

మృతులు, గాయపడిన వారి వివరాలు

ఈ విద్యుదాఘాతానికి (Electric shock) గురై టోని (21), వికాస్ (20) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, అఖిల్ అనే మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రమాద తీవ్రత

ఘటన సమయంలో ట్రాక్టర్ టైర్లు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, క్రేన్ సహాయంతో విగ్రహాన్ని తొలగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రామంతాపూర్ ఘటనతో పోలిక

ఈ ప్రమాదం, రెండు రోజుల క్రితం జరిగిన రామంతాపూర్ గోఖలే నగర్ ఘటనను గుర్తుచేసింది. అక్కడ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన రథయాత్రలో రథం విద్యుత్ తీగలను తాకడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయి, మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

వరుస ఘటనలపై ఆందోళన

ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో నగర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పండుగ సందర్భాల్లో విగ్రహాలు, రథయాత్రలు, భారీ వాహనాల తరలింపులో సురక్షా చర్యల లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/tg-weather-heavy-rains-in-telangana-today/weather/532378/

Bandlaguda Breaking News Electric Shock Hyderabad Ganesh Idol Transportation Accident Hyderabad Accident Hyderabad Youths Died latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.