📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest Telugu News: Hyd-హైదరాబాద్ లో దసరా పండుగ వేళ మాంసం, మద్యం బంద్

Author Icon By Vanipushpa
Updated: September 30, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దసరా పండుగ వేళ (అక్టోబర్ 2) హైదరాబాద్ (Hyderabad) లో మాంసం, మద్యం బంద్ కానుంది. అదే రోజున గాంధీ (Gandhi) జయంతి రావడంతో వీటిపై నిషేధం ఉండనుంది. ఆ రోజున నగరవ్యాప్తంగా మాంసం విక్రయాలపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పరిధిలోని అన్ని రిటైల్ మాంసం దుకాణాలు, చికెన్ (Chicken)సెంటర్లు, స్లాటర్ హౌస్‌లను (కబేళాలు) అక్టోబర్ 2న తప్పనిసరిగా మూసి ఉంచాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Hyd-హైదరాబాద్ లో దసరా పండుగ వేళ మాంసం, మద్యం బంద్

విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం

ఉత్తర్వులను కఠినంగా అమలు

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ నిబంధనను పాటిస్తున్నట్లు కమిషనర్ తన ప్రకటనలో గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ చట్టం 1955, సెక్షన్ 533B కింద స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధారణంగా దసరా పండుగ రోజు మాంసం అమ్మకాలు అత్యధికంగా ఉంటాయి. ఈసారి గాంధీ జయంతి కారణంగా దుకాణాలు మూసివేయాలన్న ఆదేశాలు రావడంతో విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. పండుగ సీజన్‌లో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు వాపోతున్నారు. దీంతో మాంసం ప్రియులు దసరా వేడుకల కోసం ఒకరోజు ముందుగానే మాంసం కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Dussehra Celebrations Dussehra Festival Festival Guidelines Hyderabad News Liquor Ban Meat Ban Public Restrictions telangana government Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.