Hyderabad: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే తపన యువతను ప్రమాదకరమైన దారిలో నడిపిస్తోంది. కేవలం కొన్ని లైకులు, కామెంట్ల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న తీరుపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్ గారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యువత తమ జీవితాలను రిస్క్ చేయవద్దని ఆయన హితవు పలికారు.
వైరల్ వీడియోపై స్పందన
ఒక యువకుడు వేగంగా కదులుతున్న రైలు నుంచి వేలాడుతూ రీల్ చేస్తుండగా స్తంభం ఢీకొట్టి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసి, లైఫ్‌ను రిస్క్ చేసేవారిని హెచ్చరించారు.”సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని తపన పడే వారికి ఇదో హెచ్చరిక. నడుస్తున్న రైలుకు వేలాడుతూ చేసే ఈ స్టంట్లు చూస్తుంటే ప్రాణం మీద తీపి కంటే ఫోన్లో వచ్చే లైకుల మీద ఆశ ఎక్కువైపోయినట్టుంది.
ఇలాంటి తెలివితక్కువ పనుల వల్ల ఆ యువకుడికి దక్కింది ఏంటి? కేవలం ఆసుపత్రి బెడ్ లేదా అంతిమయాత్రే కదా. మీ పిచ్చి విన్యాసాలకు ప్రాణం పోయే వరకు ఆగుతారా? ఇంట్లో మీ కోసం ఎదురుచూసే వాళ్ల గురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించారా? లైకుల కోసం లైఫ్ రిస్క్ చేసేంత పిచ్చి వద్దు. ప్రాణం పోయాక ఆ రీల్స్ ఎవరూ చూడరు. మీ కుటుంబం మాత్రం జీవితాంతం కన్నీళ్లు పెడుతుంది” అని హితవు పలికారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: