సైబరాబాద్ కొత్వాల్ అవినాష్ మొహంతి
Hyderabad: సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది నేరాలు తగ్గాయని, సైబర్ నేరాల్లో 11 శాతం తగ్గడంతో పాటు ఇతర విభాగాల్లోనూ తగ్గాయని కమిషనర్ అవినాష్ మొహంతి(Avinash Mohanty) తెలిపారు. సైబర్ నేరాలు తగ్గడం వెనుక పోలీసుల కృషితో పాటు ప్రజలు అప్రమత్తంగా వుండడం ఒక కారణమని ఆయన అన్నారు. కమిషనరేట్కు దూరంగా వుండే ప్రాంతాల ప్రజలు ఆయా ప్రాంతాలలోని డిసిపిలు, ఎసిపిలను కలిసి తమ సమస్యలను విన్నవించు కోవచ్చని ఆయన తెలిపారు. సివిల్ కేసుల్లో పోలీసుల పాత్ర పరిమితంగానే వుంటుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది సైబర్ నేరాళ్లు దోచుకున్న సొమ్ము 404.61 కోట్ల రూపాయలకు పైగా వుండడం ఆందోళన కలిగించే అంశంగా ఆయన తెలిపారు.
Read Also: TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?
సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం
గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో సైబరాబాద్ వార్షిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైబరాబాద్ మాదకద్రవ్యాల స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నామని, విధుల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2025 లో సైబరాబాద్ కమిషనరేట్కు శాంతి భద్రతల నిర్వహణ, నేరాల నివారణ సహా అనేక అంశాలలో మెరుగైన ఫలితాలు అందుకున్నామని ఆయన తెలిపారు. శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడే తాము జోక్యం చేసుకుంటామని, భూమి ఎవరిదనే విషయం, ఇతర అంశాలు తమ పరిధిలోకి రావని కమిషనర్ చెప్పారు. సైబరాబాద్లో భూ తగాదాలు ఎక్కువగా వున్నాయని, ఈ తరహా కేసుల విషయంలో పోలీసులు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ జరుపుతామని ఏకపక్షంగా దర్యాప్తు వుండదని ఆయన స్పష్టం చేశారు.
సైబరాబాద్(Cyberabad) పరిధిలో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులపై నిరంతరం నిఘా వుంటుందని ఆయన తెలిపారు. సైబరాబాద్లో ఆర్థిక నేరాల సమస్య కూడా కొంత ఇబ్బందికరంగానే వుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో పోలీసుల విచారణ కచ్చితంగానే వుంటుందని, సైబర్ నేరాల విషయంలో ప్రజలు అడ్డగోలుగా వచ్చే ప్రకటనలను నమ్మరాదని ఆయన కోరారు. ఈ తరహా కేసులో బాధితులను ఆదుకునేందుకు తమవంతుగా గట్టిగానే కృషి చేస్తున్నామని, నేరగాళ్ల అరెస్టు, సొమ్ము రికవరీ కూడా బాగానే వుంటోందని ఆయన అన్నారు.
ఈ తరహా నేరాల నివారణ ప్రజా చైతన్యం వల్లే సాధ్యమవుతుందని మొహంతి తెలిపారు. మాదకద్రవ్యాల అంశాన్ని, తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ కేసులపై విచారణ వేగంగానే సాగుతుందని, దీనికి సంబంధించి స్మగ్లర్లతో పాటు డ్రగ్స్ సరఫరాదారుల పైనా చర్యలు తీసుకుం టున్నామని, ఈ ఏడాది 575 డ్రగ్స్ కేసుల్లో 1228 మంది అరెస్టు చేయడంతో పాటు 16.85 కోట్ల రూపాయల మాదకద్రవ్యాలను జప్తు చేశామని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో కోర్టు ఆదేశాల మేరకు 25.44 కోట్ల రూపాయల డ్రగ్స్ ను దహనం చేశామని మొహంతి తెలిపారు.
హత్యలు, బందిపోటు దోపిడీలు, వాహనాల చోరీలతో పాటు ఇతరత్రా కేసుల్లో 85 శాతం కేసుల్లో నేరగాళ్లు పట్టుబడగా నేరగాళ్లకు శిక్షల శాతం 47గా వుందని ఆయన తెలిపారు. చాలా కేసులు కోర్టుల్లో విచారణలో వుండడం వల్ల శిక్షల శాతం తగ్గిందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ వ్యవస్థను చక్కదిద్దడానికి తమ వంతుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ విషయంలో తీసుకుంటున్నామని, ఆచరణ యోగ్యంగా వున్న వాటిని అమలు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు.
ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 850 మంది మరణించారని అంతకు ముందు ఏడాదితో పొ లిస్తే ఇది 43 తగ్గిందని ఆయన అన్నారు. డ్రంకన్ డ్రైవ్ దాడులు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది డ్రంకన్ డ్రైవ్ దాడు ల్లో 15,706 మందిపై కేసులు నమోదు చేయగా 385 మందికి జైలు పౌరుల సలహాలు శిక్షలు పడ్డాయని 13,447 మందికి కోర్టులు జరిమానాలు విధించాయని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు 239.37 కోట్ల రూపాయల చలాన్లు విధించామని, ఇదంతా కెమెరాల ఆధారంగా జరిగిందని, పోలీసులు బలవంతంగా ఎవరికీ విధించినవి కావని మొహంతి తెలిపారు. మహిళలు, చిన్న పిల్లల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: