📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

Hyderabad crime: చిక్కుడుపల్లిలో డ్రగ్స్ కలకలం.. ప్రియుడు ప్రియురాలు అరెస్ట్

Author Icon By Tejaswini Y
Updated: December 24, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్(Hyderabad crime) మహానగరం క్రమంగా మత్తు పదార్థాల ప్రభావంలో చిక్కుకుంటోంది. ముఖ్యంగా చలికాలంలో డ్రగ్స్ విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయని పోలీసు శాఖ అంచనా వేస్తోంది. నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో డ్రగ్స్ డిమాండ్ ఎక్కువగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు. పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా, డ్రగ్ ముఠాలు(Drug gangs) కొత్త మార్గాలను అనుసరిస్తూ రెచ్చిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్‌లోనే 10 వేల మందికి పైగా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు అంచనా ఉంది.

Read Also: TG Crime: ముగ్గురి హత్యకేసు 9 మందికి జీవిత ఖైదు

ఇప్పటి వరకు డ్రగ్స్ సరఫరాలో నైజీరియన్ గ్యాంగులు, అంతర్రాష్ట్ర ముఠాలే ప్రధానంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు చదువుకున్న, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారే డ్రగ్స్ విక్రయాల్లోకి రావడం నగరాన్ని కలవరపెడుతోంది. బీటెక్ పూర్తి చేసి, ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి డ్రగ్స్ అమ్మకాల్లో పాల్గొని పోలీసులకు చిక్కడం ప్రస్తుతం హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Hyderabad crime

కాకినాడ యువతి నుంచి డ్రగ్స్ రాకెట్ వరకు..

ఏపీలోని కాకినాడకు చెందిన సుస్మిత అనే యువతి హైదరాబాద్‌కు వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ఇమ్మాన్యుయెల్‌తో కలిసి డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిద్దరితో పాటు మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బాటిళ్లు, ఓజీ కుష్ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

డ్రగ్స్ లావాదేవీల కోసం గతంలో ఫోన్ కాల్స్, వాట్సాప్ వంటివి ఉపయోగించేవారు. అయితే వాటిని గుర్తించే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఇటీవల టెలీగ్రామ్ యాప్ ద్వారా రహస్యంగా వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. చదువుకున్న యువతే ఈ తరహా నేరాల్లో భాగస్వాములవడం హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా ఎంత లోతుగా విస్తరించిందో చెబుతోంది. ఈ ఘటనతో నగరవ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Chikkadpally Police Hyderabad Drug Mafia Hyderabad Drugs Case MDMA Seizure Software Engineer Drug Racket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.