Tipper Accident: హైదరాబాద్ (Hyderabad) నగరం మల్లంపేట ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్న సంఘటనగా మారింది. స్కూల్‌కి వెళ్లే సమయంలో మృతి చెందిన ఒకటో తరగతి విద్యార్థి అభిమన్యు రెడ్డి (Abhimanyu Reddy) మరణం పట్ల స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద ఘటన తల్లిదండ్రులకు మాత్రమే కాక, చూసే ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎన్నడూ మరిచిపోలేని బాధను కలిగించేలా ఉంది.
ప్రమాదం ఎలా జరిగిందంటే?
ఉదయాన్నే తల్లి తన బిడ్డను స్కూల్‌కి తీసుకెళ్తుండగా, వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం (టూవీలర్) ఓ టిప్పర్ లారీని ఓవర్‌టేక్ చేయబోయి టూవీలర్ అదుపుతప్పింది. టిప్పర్ అంచుకి టూవీలర్ తాకడంతో తల్లీకొడుకులు కిందపడిపోయారు. టైర్ కింద పడిపోయిన బాలుడు అభిమన్షు రెడ్డి స్పాట్‌లోనే మృతి చెందాడు.
తల్లిదండ్రుల ఆవేదన.. కన్నీటి నదిగా మారిన రోడ్డు
ప్రమాదం జరిగిన అనంతరం తల్లి షాక్‌కు లోనయ్యింది. యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏం జరిగిందో ఆ తల్లికి కూడా అర్థం కాలేదు. కిందపడిన పిల్లాడిని ఒళ్లోకి తీసుకుబోయి షాకైపోయింది. టిప్పర్ టైర్ ఆ పిల్లాడి తలపై నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయిపోయింది. బాలుడిని ఎత్తుకున్న తల్లి క్షణం పాటు పొత్తిళ్లలో పొదివి పట్టుకుంది కానీ నిర్జీవంగా వేళ్లాడిపోతున్న పిల్లాడిని చూసి తట్టుకోలేక గుండెలు పగిలేలా కన్నీరు పెట్టింది. కాసేపటికి స్పాట్‌కి చేరుకున్న తండ్రి వేదన కూడా వర్ణనాతీతం కొడుకుని కోల్పోయిన షాక్ నుంచి ఇంకా వాళ్లు తేరుకోలేకపోతున్నారు.
బలైన బాలుడు అభిమన్యు రెడ్డి
ఈ విషాద ఘటనలో మృతి చెందిన బాలుడు పేరు అభిమన్యు రెడ్డి. స్థానిక స్కూల్‌లో బాబు అభిమాన్షు ఒకటో తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. అరసెకను ఆగి ఉంటే ప్రాణం నిలబడేది ఊహించని ప్రమాదం జరిగినప్పుడు మనం చాలాసార్లు ఇలా అనుకునే ఉంటాం. ఇది కూడా అలాంటి ఘటనే రెప్పపాటులో జరిగిన ఘోరానికి పిల్లాడు బలైపోయాడు. మరికొద్ది నిమిషాలైతే స్కూల్‌కి వెళ్లిపోయేవాడు ఫ్రెండ్స్‌కి హాయ్ చెప్పేవాడు. అసెంబ్లీలో ప్లేయర్ చేసేవాడు. టీచర్ చెప్పే పాఠాలు వినేవాడు. కానీ ఈలోపే ఊహించని విధంగా ముంచుకొచ్చిన మృత్యువు పిల్లాడిని మింగేసింది.
Read also: Treasury: ఖజనాకు రూ.33,600 కోట్ల సమీకరణ
Nizamabad: త్వరలో నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభించనున్న అమిత్ షా