Hyderabad AIDS Injection Case: హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి వైద్యులు గుడ్ న్యూస్ చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో బాధితురాలికి నిర్వహించిన రక్త పరీక్షల్లో హెచ్ఐవీ (HIV) నెగిటివ్ వచ్చినట్లు ఆసుపత్రి నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ వెల్లడించారు. రిపోర్టు నెగిటివ్ వచ్చినప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా యువతికి ప్రొఫైల్ యాక్సెస్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.
Read Also : Shocking Crime News Hyderabad: పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్
వైరస్ సోకకుండా నివారించేందుకు ఈ చికిత్స అత్యంత కీలకం. సోమవారం ఉదయం మరోసారి రక్త నమూనాలను సేకరించి, మరింత లోతైన విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించనున్నట్లు వైద్య బృందం పేర్కొంది. వైద్య నిబంధనల ప్రకారం, వైరస్ బాడీలోకి ప్రవేశించిన వెంటనే రక్తంలో కనిపించకపోవచ్చు. అందుకే సోమవారం చేసే పరీక్షల ద్వారా పూర్తి స్థాయి స్పష్టత రానుంది. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :