📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telugu News: HYD: నాణ్యమైన విద్యను అందించడమే కర్తవ్యo

Author Icon By Sushmitha
Updated: December 10, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రజా పాలన ప్రభుత్వంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తామని, రేపటి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దాలంటే ఇప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ కర్తవ్యమని సంక్షేమ శాఖల మంత్రులు ప్రకటించారు. HYD గ్లోబల్ సమ్మిట్‌లో (Global Summit) భాగంగా తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 లో సంక్షేమ శాఖలపై జరిగిన చర్చలో మంత్రులు పొన్నం ప్రభాకర్, (Ponnam Prabhakar) అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ పాల్గొన్నారు.

Read Also: TG: మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

HYD The duty is to provide quality education

సంక్షేమం లేకుండా అభివృద్ధి అసాధ్యం

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ శాఖలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల విజన్-2047 లో మంచి విద్య, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక ప్రణాళికల ద్వారా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 80 శాతం కంటే ఎక్కువగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం లేకుండా అభివృద్ధి అనేది అసాధ్యమని ప్రజా పాలన ప్రభుత్వం భావిస్తుందన్నారు.

సంక్షేమ శాఖల కార్యాచరణ, ప్రాధాన్యతలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు (Skill Training) ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, రిజర్వేషన్స్ అమలు, ఉన్నత విద్య, విదేశీ విద్యలకు భవిష్యత్తులో ప్రభుత్వం అన్ని రకాల ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న మేధావుల సలహాలు, సూచనలు స్వీకరించి వాటిని కార్యాచరణలో అమలు చేస్తామన్నారు.

పరిశ్రమలలో ఇంక్లూజివ్ గ్రోత్ మరియు విద్య యొక్క పాత్ర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో పరిశ్రమలు, ఐటీ, ఫార్మా, టూరిజంలలో ఇంక్లూజివ్ గ్రోత్ (Inclusive Growth) కనబడేలా సంక్షేమ శాఖలకు ప్రాథమిక కల్పిస్తున్నారని, విద్యార్థులకు ఇన్నోవేటివ్ (Innovative) కి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. నాణ్యమైన విద్య అందించినప్పుడే ఆ సమాజం మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఈ ప్యానల్ డిస్కషన్‌లో అనితా రామచంద్రన్ (విమెన్ అండ్ చైల్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ), రిటైర్డ్ ఐఏఎస్ రెడ్డి సుబ్రమణ్యం, ప్రొఫెసర్ సుఖదేవ్ తోరబ్ (మాజీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్), ప్రొఫెసర్ కాశీం, బుర్ర వెంకటేశం (టీజీపీఎస్సీ చైర్మన్), ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ (మహిళా యూనివర్సిటీ వీసీ) వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Adluri Laxman Kumar azharuddin future generations Google News in Telugu Latest News in Telugu ponnam prabhakar Praja Palana government Pratham Pradhyanya Quality Education Telangana Rising Vision 2047 Telangana welfare ministers Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.