మొదటిరోజు ఆర్ టిసి బస భవన్ గ్రౌండ్లో బహిరంగ సభ
హైదరాబాద్ : హైదరాబాద్లో (HYD) రేపటి (ఆదివారం) నుంచి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఐద్వా 14వ జాతీయ మహాసభలను ఈ నెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్లో నిర్వహించినున్నారు. అందులో భాగంగా ఆదివారం మహిళలతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 25న బహిరంగ సభను నిర్వ హించి.. 26 నుంచి 28 వరకు ప్రతినిధుల సభను నిర్వహించనున్నారు.
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 1000 ప్రతినిధులు హాజరు కానున్నారు. 25న మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభకు ఐద్వా అలిండియా ఫ్యాట్రన్, మాజీ ఎంపి బృందా కరత్ తోపాటు ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పికె శ్రీమతి, జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ఛావలే పాల్గొంటారు. తెలంగాణ (TG) రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మొదటిసారిగా ఐద్వా జాతీయ మహాసభలు జరగనున్నాయి. 26 నుంచి 28 వరకు 1000 మంది ప్రతినిధులతో మహా సభలు జరగనున్నాయి. ప్రతినిధుల సభ విఎస్టిటి దగ్గర గల ఆర్టిస్ కళాభవన్లో జరగనున్నాయి.
Read Also: AP: ఇన్‌స్టాలో బాలుడి పరిచయం..ఇల్లు విడిచి వెళ్లిన బాలిక.. తర్వాత ఏమైందంటే?
ఐద్వా 14వ జాతీయ మహాసభకు ఏర్పాట్ల పరిశీలన
26న ప్రారంభం కానున్న ప్రతినిధుల సభలో సీని నటి రోహిణి పాల్గొనున్నట్టు విద్వా నాయకులు తెలిపారు. (HYD) ఐద్వా 14వ జాతీయ మహాసభల నేపథ్యంలో ఈ నెల 25న జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఐద్వా నేతలు శుక్రవారం పరిశీలించారు. ఆదివారం బస్ భవన్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభ స్థలాన్ని ఐద్వా జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియం దావలె, పీకే శ్రీమతితో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీనియర్ నాయకురాలు జ్యోతి, మహాసభల పబ్లిసిటీ కన్వీనర్ మహమ్మద్ అబ్బాస్, ఆశలత, సరళ, బి ప్రసాద్, శోభన్నాయక, పరిశీలించారు.
చారిత్రాత్మకమైన జాతీయ మహాసభలు భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహిళా దళానికి నాయకత్వం వహించిన కామ్రేడ్ మల్లు స్వరాజ్యం పేరు మీద బహిరంగ సభ ప్రాంగణం ఏర్పాటు చేశామని ఐద్వా నేతలు తెలిపారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే వేలాదిమంది మహిళలతో జరిగే ర్యాలీ సుందరయ్య పార్క్ నుండి నారాయణగూడ ఫ్లైఓవర్, నగర్ మీదుగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు జరుగుతుందన్నారు.
రాజకీయ, సామాజిక అంశాలపై మహిళా సంఘాల విమర్శలు
దేశంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వ శక్తుల కార్పోరేట్ల బంధం బలపడిందని, సరళీకరణ ఉదారవాద విధానాలు మహిళలను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయన్నారు. (HYD) ఆర్ఎస్ఎస్, బిజెపి మతోన్మాద శక్తులు మహిళను ద్వితీయ పౌరురాలుగా వంటింటికే పరిమితం చేయాలని చూస్తున్నాయని మండిపడానడరు. మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం, పని ప్రదేశంలో మహిళలకు రక్షణ కల్పించడం, సమాన పనికి సమాన వేతనం కల్పించడం, ఆస్తి హక్కు కల్పించడం వంటివి నేటికీ నెరవేరలేదని చెప్పారు. గృహ హింసను, లైంగిక హింసను అరికట్టడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు. మొదటి రోజు ర్యాలీ, బహిరంగ జరగనుంది. 26న ప్రతినిధుల ప్రారంభ సభకు సినీనటి రోహిణి హాజరు కానున్నారు. 27న వివిధ జాతీయ మహిళా సంఘాల సౌహార్ధక సందేశాలను ఆయా సంఘాల నేతలు ఇవ్వనున్నారు. చివరి రోజైన 28న భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకుని.. సంఘం నూతన జాతీయ కమిటీని ఎన్నుకోనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: