హైదరాబాద్ (సికింద్రాబాద్): HYD గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital) వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. జన్మాంతర రక్తవ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడికి ల్యాపరోస్కోపిక్ (కీహోల్) విధానంలో ప్లీహము తొలగించే శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను పూర్తిగా ఉచితంగా పూర్తి చేశారు.
Read Also: Egg prices: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు
హెరిడిటరీ స్పీరోసైటోసిస్, క్లిష్టత
ఆకినేపల్లి గ్రామానికి చెందిన అఖిల్ అనే బాలుడు హెరిడిటరీ స్పీరోసైటోసిస్ అనే జన్మాంతర రక్తవ్యాధితో బాధపడుతున్నాడు. మూడు నెలల వయసు నుంచే వ్యాధి లక్షణాలు కనిపించాయి. ప్లీహము పెరగడం, పసుపు రోగం (జాండిస్), తీవ్ర రక్తహీనతతో బాధపడుతూ, ప్రతి వారం రక్త మార్పిడి అవసరమయ్యేది. ల్యాపరోస్కోపిక్ స్ప్లెనెక్టమీ అనేది రక్తస్రావం ప్రమాదం ఎక్కువగా ఉండే, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స. ఖర్చులు అధికం కావడం వల్ల ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఇది అరుదుగానే చేస్తారు.
వైద్యుల బృందం, విజయం
పీడియాట్రిక్ సర్జరీ (Pediatric Surgery) విభాగం ప్రొఫెసర్ అండ్ హెచ్‌ఓడీ డాక్టర్ నాగార్జున నాయకత్వంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. డాక్టర్ మనోజ్ కుమార్, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ పవన్ రావు, డాక్టర్ అశ్రిత్ రెడ్డి తదితరులు శస్త్రచికిత్సలో పాల్గొన్నారు. అనస్తీషియా విభాగం నుంచి ప్రొఫెసర్ డాక్టర్ అవ్వుల మురళి, డాక్టర్ బబితా కీలక సహకారం అందించారు. వైద్యులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అత్యాధునిక, క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసేందుకు గాంధీ ఆస్పత్రి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని, పేద, వెనుకబడిన పిల్లలకు కూడా ప్రపంచ స్థాయి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: