📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

HYD: పైకి పాన్ మసాలా లోపల డ్రగ్స్ దందా

Author Icon By Saritha
Updated: January 8, 2026 • 4:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ ను (HYD) డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలని పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నగరమంతా చల్లెడపడుతున్నారు. మత్తుపదార్థాల విక్రయం, సరఫరాలపై ఉక్కుపాదాన్ని మోపి, వాటి నిర్మూలనకు అవిశ్రాతంగా కృషి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో భారీ మాదకద్రవ్యాల దందాను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. పాన్ మసాలాల్లో మత్తు మందులు కలుపుకుని సేవించడమే కాకుండా, వాటిని అక్రమంగా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పేట్ బషీరాబాద్ పోలీసులు, ఈగల్ ఫోర్స్ ఛేదించింది.

పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుండి జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వలస వచ్చిన చాలామంది కళాకారులు మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారు. వీరు ఎండీఎంఏ, నల్లమందు వంటి ప్రమాదకరమైన మత్తుపదార్థాలను పాన్ మసాలాలలో కలుపుకుని సేవించడం పరిపాటిగా మారింది. సొంత ఊర్లకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు తమతో పాటు భారీ మొత్తంలో ఈ డ్రగ్స్ ను తీసుకువచ్చి, తోటి రాజస్థానీ కార్మికులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Read also: Rangareddy Accident: మోకిలా రోడ్డు ప్రమాదం: పోస్టుమార్టం పూర్తి

పక్కా సమాచారంతో దాడి

(HYD) పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసులన అప్రమత్తం చేసింది. గత ఒక నెల రోజులుగా నిఘా బృందాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాయి. ఈ సంయుక్త ఆపరేషన్ లో కీలక నిందితుడుపట్టుబడ్డాడు. రాజస్థాన్ నుండి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్న రాజేందర్ (31) అనే ఇంటీరియర్ డిజైనర్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

నిందితుడి వద్ద వాణిజ్య పరిమాణానికి 20రెటుల ఎక్కువగా ఉన్న 200గ్రాములు ఎండిఎంఎ, 60గ్రాముల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్లో సుమారు రూ. 15లక్షలు ఉంటుందని అంచనా. మత్తుకు బానిసైన ఇతను, హైదరాబాద్లో దీనికి డిమాండ్ పెరగడంతో రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాకు చెందిన సప్లయర్లు ధన్ రాజ్, అనిల్, ముఖేష్ నుంచి డ్రగ్స్ సేకరించి నగరానికి తెచ్చేవాడు. ఇక్కడ గ్రాముకు రూ.5000 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్న పలువురి వినియోగదారులను కూడా పోలీసులు గుర్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

CyberabadPolice DrugRacketBusted EagleForce HyderabadDrugs InterstateDrugGang Latest News in Telugu PanMasalaDrugs Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.