📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Latest news: Hyd Metro Rail: మెట్రో నిర్మాణంపై వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశం

Author Icon By Saritha
Updated: November 6, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
పాతబస్తీ మెట్రో నిర్మాణంపై హైకోర్టు దృష్టి

పాతబస్తీలో మెట్రో రైలు(Hyd Metro Rail) నిర్మాణానికి సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ(Telangana) హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టు పాతబస్తీ ప్రాంత అభివృద్ధికి కీలకమని కోర్టులో తెలిపింది. అయితే, నిర్మాణ పనులకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, మెట్రో పనులు చారిత్రక కట్టడాలకు సమీపంలో జరుగుతున్నాయని, పురావస్తు శాఖ నుంచి తగిన అనుమతులు పొందలేదని పిటిషనర్ ఆరోపించారు. చారిత్రక స్థలాల వద్ద నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలు ఉన్నాయని ఆయన న్యాయవాది కోర్టుకు వివరించారు.

Read also: జాగ్రత సుమా! ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు

మెట్రో నిర్మాణంపై వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశం

ప్రభుత్వానికి పూర్తి వివరాలు సమర్పించాలంటూ ఆదేశం

ప్రభుత్వం(Hyd Metro Rail) తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ, ఎంజీబీఎస్‌ నుండి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రెండో దశ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పాతబస్తీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ పిటిషన్ దాఖలు చేశారని ఆయన అన్నారు.

ఇరువురి వాదనలు విన్న హైకోర్టు, పాతబస్తీ ప్రాంతంలో జరుగుతున్న మెట్రో నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక వివరాలు, ప్రాజెక్టు మ్యాప్‌తో సహా సమగ్ర నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 18కు వాయిదా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

court-hearing hyderabad-metro Latest News in Telugu old-city-development telangana-high-court Telugu News urban-development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.