ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిగార్ తో మావోయిస్టులపై జెల్లడ పడుతున్నారు. మావోయిస్టులలో అనేకులను హతమార్చిన కేంద్రం సక్సెస్ వైపుగా అడుగులు వేస్తున్నది. తాజాగా మావోయిస్టు పార్టీకు గట్టి దెబ్బ తగిలింది. తెలంగాణ డీపీజీ ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగిపోయారు. బర్సే దేవా వెంట మరో 15 మంది ఉన్నారు. ప్రస్తుతం గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా పనిచేస్తున్న దేవా హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సాయుధ బలగాల వ్యవహారాలు చూస్తున్నారు. గురువారం తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు నుంచి బర్సె దేవా బృందాన్ని పోలీసులు (HYD) హైదరాబాద్ కు తీసుకొచ్చారు.
Read also: Hyderabad: పొగమంచుతో శంషాబాద్–బెంగళూరు హైవేలో ట్రాఫిక్ జామ్
ఆపరేషన్ సిగార్ తో ఉక్కిరిబిక్కిరి
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిగార్ తో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.(HYD) వందలమంది మావోయిస్టులు మరణించగా, అనేకులు పోలీసుల ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. తాజాగా మరోసారి బర్సే లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: