📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

HYD: మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు

Author Icon By Saritha
Updated: December 27, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గ్రేటర్ హైదరాబాద్ (HYD) వాసుల అవసరాలు తీర్చేందుకు మై జీహెచ్‌ఎంసీ యాప్‌ (My GHMC App) అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ యాప్‌లో పాత జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల వివరాలు మాత్రమే అందుబాటులో ఉండగా, తాజాగా విలీనమైన 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వివరాలను కూడా సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. శివారు ప్రాంతాల ప్రజలు తమ పరిధిలోని సమస్యలపై ఫిర్యాదు చేస్తే.. ఆ సమాచారం నేరుగా సంబంధిత మున్సిపల్ కమిషనర్‌కు చేరేలా ఏర్పాట్లు చేశారు. అయితే వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడానికి, ఫిర్యాదు అందిన వెంటనే కమిషనర్‌తో పాటు బాధ్యుడైన విభాగపు అధికారికి కూడా సమాచారం వెళ్లేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం కొత్త డివిజన్ల సరిహద్దులను జియో ఫెన్సింగ్ చేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ప్రజలు ఈ యాప్ ద్వారా దాదాపు అన్ని విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.

Read Also: HYD: హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే!

Key changes made to the My GHMC app.

ఫిర్యాదులు, పౌర సేవలు, చెల్లింపులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లో

రోడ్లపై గుంతలు, డ్రైనేజీ మ్యాన్‌హోళ్ల సమస్యలు, నాలాల పూడికతీత, చెత్త సేకరణ, ఆహార కల్తీ, జనన-మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం, దోమల నివారణ, అక్రమ కట్టడాలు, పార్కింగ్ సమస్యలు, సెల్లార్ల దుర్వినియోగం, హోర్డింగుల నియంత్రణ, వీధి దీపాల నిర్వహణ, వీధి కుక్కల బెడద, ఆస్తిపన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్సుల జారీ వంటివి చేయనున్నారు. (HYD) జీహెచ్‌ఎంసీ(GHMC) కమిషనర్ ఆర్వీ.కర్ణన్ తెలిపిన వివరాల ప్రకారం.. త్వరలోనే కేవలం ఫిర్యాదులే కాకుండా ఆస్తిపన్ను చెల్లింపులు, భవన నిర్మాణ అనుమతుల స్థితిగతులు వంటి పూర్తిస్థాయి పౌర సేవలను శివారు ప్రాంతాలకు కూడా ఈ యాప్ ద్వారా విస్తరిస్తారు. దీనివల్ల ప్రజలు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Digital Governance GHMC Hyderabad Expansion Latest News in Telugu My GHMC App Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.