📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: HYD: రాష్ట్రంలో రూ.4 లక్షల కోట్ల వక్ఫ్ భూములు హాంఫట్?

Author Icon By Sushmitha
Updated: November 17, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: HYD దేశంలో అత్యంత విలువైన వక్ఫ్ భూములున్న రాష్ట్రాల్లో తెలంగాణ (Telangana) ఒకటిగా నిలిచింది. వక్ఫ్ బోర్డుకు (Waqf Board) దాదాపు రూ.5 లక్షల కోట్ల విలువగల భూములున్నా, అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. వక్ఫ్ బోర్డుకు చెందిన కొందరు అధికారులు, పాలకవర్గాల అవినీతి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ భూముల్లో 75 శాతం అంటే సుమారు రూ.4 లక్షల కోట్ల ఆస్తులు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని బోర్డు అధికారులే అంచనా వేశారు. వక్ఫ్ బోర్డుకు చెందిన 2,186 భూములకు సంబంధించిన రికార్డులు కూడా లేవని గతంలో హైకోర్టుకు బోర్డు తెలిపింది.

Read Also: Free sarees scheme: తెలంగాణ ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఉచిత చీరల పంపిణీ

HYD: Is the state holding Rs.4 lakh crore worth of waqf lands

ఉమ్మడి జిల్లాల వారీగా అన్యాక్రాంతమైన భూములు

తెలంగాణలో మొత్తం 33,929 వక్ఫ్ సంస్థల ఆధీనంలో 77,538.07 ఎకరాల భూములు ఉన్నాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇందులో 57,423.91 ఎకరాలు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి.

అరకొర ఆదాయం, లీజుల వ్యవహారం

కోట్లాది రూపాయల విలువగల భూములున్నా, అవి కబ్జా పాలవడం, నామమాత్రపు అద్దెలు చెల్లించడం వల్ల వక్ఫ్ బోర్డుకు ఆదాయం అరకొరగా మాత్రమే వస్తుంది. వక్ఫ్ బోర్డుకు అద్దెల రూపంలో ఏడాదికి కేవలం రూ.5 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. దాదాపు 20,110 ఎకరాల్లో ఉన్న లీజుదారులు కొన్నేళ్ల క్రితం నిర్ణయించిన నామమాత్రపు అద్దెలనే చెల్లిస్తున్నారు. ముస్లింల విద్యాభివృద్ధి, పేదల ఉపాధికి ఉపయోగపడాల్సిన వక్ఫ్ ఆస్తులను వినియోగించుకోవాలని పాలకవర్గాలకు సూచించినా, ప్రముఖులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Corruption Google News in Telugu land encroachment Latest News in Telugu property scandal. Telangana Wakf land Telugu News Today Wakf Board

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.