HYD: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇక మీ ఉద్యోగనీకె ముప్పు

Read Time:  1 min
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇక మీ ఉద్యోగనీకె ముప్పు
FONT SIZE
GET APP

హైదరాబాద్ (HYD) యువతకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం (Alcohol) సేవించి పట్టుబడితే ఉద్యోగం కోల్పోవడం ఖాయం అని నగర ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిపై కేవలం జరిమానాతో సరిపెట్టకుండా, వారి ఉద్యోగ భవితవ్యంపై కూడా ప్రభావం పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇటీవల నగరంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పలువురు ఉద్యోగులు మద్యం మత్తులో వాహనాలు (Vehicles) నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, డెలివరీ బాయ్స్ కూడా ఉన్నారు. కోర్టులో కేసులు నమోదు కావడంతో పాటు, వారి ఉద్యోగ సంస్థలకు సమాచారం పంపే ప్రక్రియ కొనసాగుతోందని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు.

Read Also: Telangana: మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం

HYD: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇక మీ ఉద్యోగనీకె ముప్పు
If you are caught drunk driving, your job will be at risk.

(HYD) డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దోషిగా తేలినవారిపై జరిమానా, జైలు శిక్ష, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక, కంపెనీ పాలసీల ప్రకారం, క్రిమినల్ కేసులు నమోదైన ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశముంది అని వారు తెలిపారు.

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేవలం ప్రాణాలకే కాదు.. ఉద్యోగం, కుటుంబ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.