హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ(Telangana)ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నగర వాసులు ఎదుర్కొంటున్న వాహన రద్దీ సమస్యలను పరిష్కరించేందుకు రెండు కొత్త ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణానికి(HYD)మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా పీక్స్ అవర్స్‌లో, పాఠశాలలు, ఆఫీసుల సమయాల్లో తీవ్రంగా ఎదురయ్యే ట్రాఫిక్ జామ్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read also: మెడికల్ విద్యార్థులకు శుభవార్త – ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
పారడైజ్ నుంచి శామీర్‌పేట, డెయిరీ ఫాం రోడ్డు వరకు కారిడార్‌లు
ఈ ప్రాజెక్టులో భాగంగా, పారడైజ్ జంక్షన్ (HYD) నుంచి శామీర్‌పేట వరకు ఓఆర్ఆర్ రహదారి మీదుగా, మరో కారిడార్ పారడైజ్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించనున్నారు. ఈ నిర్మాణ పనుల కోసం అవసరమైన డిజైన్‌లు, టెండర్ల ప్రక్రియను అత్యవసరంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. ఈ మార్గాలపై ఎలివేటెడ్ కారిడార్‌లు సిద్ధమవుతే, భవిష్యత్‌లో ట్రాఫిక్ ఒత్తిడి నుంచి నగర వాసులకు భారీ ఊరట లభించనుంది.
భూసమస్యలు పరిష్కార దశలో
ఈ నిర్మాణాల కోసం అవసరమైన 435.08 ఎకరాల భూమి కౌకూర్, సింగాయిపల్లి, తూముకుంట, జవహర్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఉండగా, వీటి విలువ ₹1,018.79 కోట్లు. ఈ భూములు రక్షణ శాఖ పరిధిలో ఉండటంతో, ప్రభుత్వం వాటి బదులుగా సమాన విలువైన భూములను రక్షణ శాఖకు అప్పగించనుంది.
అలాగే, 2008లో ఒడిశాలో నక్సల్స్ కాల్పుల్లో అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబాలకు కేటాయించిన భూమిని ఇప్పుడు వేరే ప్రదేశానికి మార్చారు. కొత్తగా గాజులరామారం గ్రామంలో 3.10 ఎకరాల భూమిని వారికి అందజేయనున్నారు. గతంలో కేటాయించిన భూముల్లో పేదవారి నివాసాలు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: