📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HYD: గోషామహల్లో భారీగా డబ్బు పట్టివేత

Author Icon By Saritha
Updated: February 11, 2026 • 10:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గోషామహల్ (హైదరాబాద్): (HYD) ద్విచక్రవాహనాలపై ముగ్గురు యువకులు సంచుల్లో డబ్బును తీసుకుని వస్తుండగా పోలీసుల తనిఖీలో భారీ మొత్తంలో నగదు బయపడింది. దీంతో పోలీసులు డబ్బుకు (money) సంబంధించిన వివరాలు తెలుపక పోవడంతో ముగ్గురితోపాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం గోకుల్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాపు సమీపంలో రెండు ద్విచక్రవాహనాలపై అనుమానాస్పదంగా సంచులతో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.

Read Also: TG Municipal Elections: రూ.5 లక్షల నగదు సీజ్!

అక్రమ మధ్యం అమ్మకాలు చేస్తున్న యువకున్ని అరెస్ట్ చేసిన పోలీసులు

ద్విచక్రవాహనంపై వస్తున్న జ్యోతిరామ్, గణపతిరామ్, మహేందర్ల వద్ద సుమారు 76 లక్షల 87వేల 650 రూపాయలు లభించినట్లు తెలిపారు. (HYD) డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారని ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు. విచారణ సమయం లో అనుమానితులు పొంతలేని సమాధానాలు ఇవ్వడంతో పాటు నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలను సమర్పించలేక పోయినట్లు చెప్పారు. దీంతో నగదును పోలీసులు సీజ్ చేసినట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ కేసు గోషామహల్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమంగా మధ్యం అమ్మకాలు చేస్తున్న ఓ యువకున్ని గోషామహల్ పోలీసులు దాడులు నిర్వ హించి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జుమ్మెరాత్ బజార్లో అక్రమంగా సూర్యవంశీ ఆదర్శ మధ్యం అమ్మకాలు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి 18.59 లీటర్ల వివిధ ఐఎం ఎఫ్ఎల్ బాటిళ్ల బీర్ బాటిళ్లను స్వాధీనం చేసు కున్నారు. అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరు పర్చారు. ఈ కేసును గోషామహల్ పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Cash Seized Goshamahal hyderabad Latest News in Telugu Police seizure Suspicious Activity Telugu News Two-Wheeler Checking

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.