నాన్ టీచింగ్ ఉద్యోగ పరీక్షల్లో వెలుగుచూసిన ఘటన
గచ్చిబౌలిలోని(HYD) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అధునాతన టెక్నాలజీ ఏఐని ఉపయోగించి హైటెక్ మాస్ కాపీయింగ్కు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. హెచ్సీయులో నిర్వహిస్తున్న నాన్టీరింగ్ ఉద్యోగ నియామక పరీక్షల్లో వెలుగు చూసిన ఈ హైటెక్ మాస్ కాపీయింగ్ విషయం సంచలనంగా మారింది.. ఆధునాతన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో ప్రశ్నాపత్రాలను స్కాన్ చేసి, చెవి ఇయర్ ఫోన్తో జవాబులు విని పరీక్షల్లో రాస్తూ అభ్యర్థులు పట్టుబడ్డారు. ఈ విషయమై ఇద్దరు హర్యానా యుకులు పట్టుబడగా, యూనివర్సిటీ అధికారులు ఇద్దరిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం..
Read Also: TG Weather: తెలంగాణను వణికిస్తున్న చలి
బ్లూటూత్ స్కానర్లతో హైటెక్ కాపీయింగ్
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాన్ టీచింగ్ విభాగంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. (HYD) ఈనెల 21వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గచ్చిబౌలిలోని వర్సిటీ క్యాంపస్ ఆవరణలో రాత పరీక్ష నిర్వహించారు. ఈ రాత పరీక్షకు హర్యానా రాష్ట్రానికి చెందిన అనీల్ 30 సైతం హజరయ్యాడు. కాగా పరీక్ష రాస్తున్న సమయంలో అనీల్ చెవిలో ఉన్న బ్లూటూత్ నుంచి పదేపదే బీప్ సౌండ్ రావడంతో ఇన్విజిలేటర్ తనిఖీ చేశాడు. బ్లూ బూతు స్కానర్ను గుర్తించగా, స్కానర్తో ప్రశ్నాపత్రాన్ని స్కాన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) సాయంతో సమాదానాలు తెలుసుకొని రాస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆనీల్ను అదువులోకి తీసుకున్న వర్సిటీ అధికారులు మిగిలిన విద్యార్థులను మొత్తం తనిఖీ చేశారు. ఇందులో హర్యానాకే చెందిన మరో యువకుడు సతీష్ వద్ద సైతం స్కానర్తో కూడిన బ్లూటూత్ లభించింది. ఇతను సైతం ప్రశ్నా పత్రాన్ని స్కాన్ చేసి ఎఐ సమాధానాలతో జవాబులు రాస్తున్నట్లు వెలుగు. చూసింది. దీంతో ఇద్దరు యువకులను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. హెచ్సీయు రిజిస్ట్రార్ దేవేష్ నిఘమ్ సిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: