News Telugu: Hyd Fraud: నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

Read Time:  1 min
Hyd Fraud
Hyd Fraud
FONT SIZE
GET APP

సీఐ భార్య కవితా రెడ్డి పేరుతో భారీ మోసం బయటపడింది. బంగారం, (Gold) గ్రానైట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తానని చెప్పి అనేక మందిని నమ్మించి డబ్బులు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె సీఐ భార్య అనే పేరును ఉపయోగించుకోవడంతో చాలామంది నమ్మి లక్షల్లో డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డబ్బులు తిరిగి అడిగితే బాధితులపైనే బెదిరింపులకు దిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా ఓ ఆటో డ్రైవర్ నుంచి సుమారు రూ.30 లక్షలు తీసుకొని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.

Read also: AP Crime: చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం..

Hyd Fraud

Hyderabad Fraud

డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా

హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదులు చేరడంతో, వారి బృందం కవితా రెడ్డిని నాగోల్ ప్రాంతంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది. ఆమె బోటిక్ వ్యాపారం పేరుతో కూడా కస్టమర్లను మోసించినట్టుగా పోలీసులు గుర్తించారు. పెట్టుబడి పేరుతో మోసపోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో ఆమె పలువురికి అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టమని చెప్పి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఆలస్యం చేసినట్టు బయటపడింది.

ఇక మరోవైపు, కవితా రెడ్డి భర్త అయిన సీఐ గత కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నారని సమాచారం. అయితే ఆమె పోలీసు అధికారి భార్య అనే పేరును ఉపయోగించి ప్రజలను నమ్మించి మోసం చేసిన విధానం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది. ప్రస్తుతం మరిన్ని బాధితులు ముందుకు రావడంతో కేసు మరింతగా విస్తరించే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.