హైదరాబాద్ (HYD) లోని నాంపల్లి (Nampally) ప్రాంతంలో శనివారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఓ ఫర్నీచర్ షాపులో, ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నాలుగంతస్తుల భవనంలోని అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాప్తి చెందాయి. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కాగా ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Telangana: కేటీఆర్, హరీశ్ రావులకు KCR సూచన
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ప్రస్తుతం ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనాస్థలానికి జేఎన్టూయూ ఇంజినీరింగ్ బృందం చేరుకుంటుంది. భవనాన్ని తనిఖీ చేసి అధికారులకు నివేదిక సమర్పించనుంది. అక్కడి పరిస్థితిని సీపీ సజ్జనార్, ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అధికారులు భవనం లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెండు రోబోలను పంపించారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనా స్థలంలో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: