📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

HYD: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

Author Icon By Aanusha
Updated: February 7, 2026 • 8:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (HYD) నగరంలోని అత్యంత కీలకమైన నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ శనివారం
ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్లో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 40 నుంచి 50 కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Read Also: CM Revanth : కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

ఉన్నత స్థాయి విచారణ జరగాలి

ప్రమాదం జరిగిన చోటే వివిధ సంచలన కేసులకు సంబంధించిన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు ఉన్నట్లు సమాచారం. డిజిటల్ సాక్ష్యాలు అగ్నికి ఆహుతి కావడంతో దర్యాప్తు సంస్థల్లో ఆందోళన మొదలైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు.పోలీసు శాఖకు అత్యంత కీలకమైన, గట్టి భద్రత ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని,

HYD: Fire accident in forensic lab.. RS Praveen Kumar responds

అనేక సున్నితమైన కేసులకు సంబంధించిన ఆధారాలు (2015 నాటి ఓటుకు నోటు కేసుతో సహా ) ఇందులో భద్రపరచి ఉన్నాయని పేర్కొన్నారు. వాటి పరిస్థితి ఏమిటి? దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆధారాల నిర్మూలనకు ప్రస్తుత పాలకులు ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు. అమెరికాలో ఎంతోమంది చిన్నారులను అపర కుబేరులకు అర్పించిన లైంగిక నేరస్తుడు ఎ‌ప్‌స్టీన్ జైలులో అనుమానాస్పదంగా చనిపోయాడని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

brs fire incident ktr latest news Nampally Forensic Lab RS Praveen Kumar Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.