📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: HYD: పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు జప్తు చేసిన ఈడీ

Author Icon By Sushmitha
Updated: November 25, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: HYD పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. మధుసూదన్ రెడ్డికి చెందిన రూ.80 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ (ED) అధికారులు సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

Read also : Ibomma: రవి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

HYD ED seizes assets of Patancheru MLA’s brother

అక్రమాలు, బినామీ ఆస్తులు

మధుసూదన్ రెడ్డికి (Madhusudhan Reddy) చెందిన సంతోష్ షాండ్ అండ్ గ్రానెట్ కంపెనీ రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడిందని, ప్రభుత్వానికి రూ.39.8 కోట్ల రాయల్టీ చెల్లించలేదని ఈడీ అభియోగాలు మోపడం తెలిసిందే. ఇందులో భాగంగా గత ఏడాది మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు కార్యాలయాలలో ఈడీ అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలను జప్తు చేశారు. మధుసూదన్ రెడ్డికి చెందిన ఆస్తులు ఇతర వ్యక్తుల పేర్ల మీద ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు, వీరంతా మధుసూదన్ రెడ్డికి బినామీలుగా ఈడీ పేర్కొంది.

సబ్ కాంట్రాక్ట్ నిబంధనల ఉల్లంఘన

సంతోష్ షాండ్ అండ్ గ్రానెట్ సప్లయ్‌కు ప్రభుత్వం మైనింగ్ అనుమతి ఇస్తే, దానిని మధుసూదన్ రెడ్డి మరో భాగస్వామ్య సంస్థకు సబ్ కాంట్రాక్ట్‌కు ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే మధుసూదన్ రెడ్డికి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని వారు వెల్లడించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Asset Seizure ED property attachment Google News in Telugu Gudem Madhusudan Reddy Gudem Mahipal Reddy Latest News in Telugu Patancheru MLA brother Telangana. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.