📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: HYD: రైతుల ఖాతాల్లో ధాన్యం విక్రయాల డబ్బు జమకు ఆలస్యం

Author Icon By Sushmitha
Updated: December 8, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో (HYD) పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల అసమర్థత కారణంగా, ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు వారి ఖాతాల్లో సమయానికి జమ కావడం లేదు. ముఖ్యంగా, మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీ (Bank Guarantee) తీసుకోవడంలో అధికారులు విఫలం కావడంతో, ధాన్యం కేటాయింపులు కొద్ది సంఖ్యలో మిల్లులకు భారీగా కేటాయిస్తున్నారు.

Read Also:  Kavitha: మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు

కొనుగోలు వివరాలు:

మరోవైపు, కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి వచ్చిన 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తుండటంతో రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.

HYD Delay in depositing money from grain sales into farmers’ accounts

మిల్లు కేటాయింపులు, గ్యారెంటీ సమస్యలు: రైతులు అనిశ్చితిలో

ఆన్‌లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (Online Procurement Management System) లో మిల్లు జనరేట్ కాకపోవడంతో, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు పంపడమే సవాల్‌గా మారింది. తెలంగాణలో మూడు వేలకు పైగా రైస్ మిల్లులు ఉండగా, అందులో దాదాపు వెయ్యి వరకు సీఎంఆర్ (Custom Milled Rice) ఇవ్వని బకాయిదారులు ఉన్నారు. వీరికి ధాన్యం కేటాయించడం లేదు. మరోవైపు, బ్యాంకు గ్యారెంటీలు తీసుకోవడంలో కూడా అధికారులు విఫలం కావడంతో ధాన్యం సేకరణపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

రబీ సీజన్ ఆరంభం కావడంతో రైతులు ధాన్యం విక్రయాలకు కేంద్రాలలో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు, మిల్లు పాయింట్‌కు ధాన్యం చేరినా ఎంఎస్పీ రాక రైతులు అనిశ్చితికి గురవుతున్నారు.

బోనస్ చెల్లింపుపై భిన్నాభిప్రాయాలు

సివిల్ సప్లయ్ అధికారులు ఇప్పటి వరకు సన్నాలకు రూ. 412 కోట్ల రూపాయలు బోనస్ చెల్లించామని చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం గత యాసంగి బోనస్ మరియు ఇప్పటి ఖరీఫ్ సీజన్ బోనస్ కూడా తమకు రాలేదని ఆరోపిస్తున్నారు.

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ (Telangana) రీజియన్‌లో కొన్ని మెట్టప్రాంతాలకు పరిమితమైన వరిధాన్యం పంట, ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లోనూ విస్తరించడంతో ధాన్యం దిగుబడి పెరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BankGuaranteeFailure CivilSuppliesDepartment CMRDefaulters FarmersGrievance Google News in Telugu KharifSeason Latest News in Telugu MSPPayments PaddyPaymentDelay RiceMillersIssue TelanganaFarmers Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.