📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Telugu News: Hyd Crime: తల్లిదండ్రులు మందలించారని పదోతరగతి బాలిక ఆత్మహత్య

Author Icon By Sushmitha
Updated: November 25, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమ బిడ్డలు బాగా చదవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం రెక్కలు ముక్కలు చేసుకుని, కష్టపడి సంపాదించిన డబ్బంతా పిల్లల చదువులకే కేటాయిస్తారు. వారి ఉజ్వల భవితకోసం ఎన్నో కలలు కంటారు. తమను ఉద్దరించకపోయినా వారి జీవితాలను సౌకర్యవంతంగా జీవిస్తే చాలని ఆశిస్తారు. అందుకోసం పిల్లలు అడిగినవన్నీ కొనిస్తుంటారు. సరిగ్గా చదవకపోతే చదవమని చెబుతారు. ఇంకా నిర్లక్ష్యంగా చదువుపై శ్రద్ధ లేకపోతే గద్దిస్తారు. 

Read also : PM Modi : అయోధ్యలో మోదీ ప్రత్యేక పర్యటన రామమందిరంపై..

Hyd Crime Tenth grade girl commits suicide after being scolded by parents

ఇదంతా వారికి ప్రేమ లేకకాదు, తమ బిడ్డల బాగుకోసమే. ప్రేమించేవారు గద్దిస్తారు. కానీ ఈ సున్నిత భావాలను పిల్లలు కూడా గ్రహించాలి. కానీ ఆ భావానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే మాత్రం వాటి పర్వవస్థానాలు భిన్నంగా ఉంటారు. కొన్నిసార్లు ఊహించని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇలాంటి నిర్ణయమే ఓ బాలిక తీసుకుంది.

పైనుంచి దూకిన బాలిక

హైదరాబాద్ లోని (Hyd Crime) హబ్సిగూడ (Habsiguda) పరిధిలో పదోతరగతి చదువువున్న ఓ బాలిక మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించారు. చక్కగా చదువుకోవాలని బుద్ధి చెప్పారు. బోర్డు పరీక్షలు రాయాలి కాబట్టి చదువుపై శ్రద్ధ చూపాలని కోరారు. కానీ ఆ బాలిక కఠిన నిర్ణయం తీసుకుంది.

బాలిక (15) బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తీవ్రగాయాలతో మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ బిడ్డ అందరిలా చక్కగా చద వాలనే కోరిక మందలించామే తప్ప చావు కోరలేదని ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నేటి విద్యార్థులు చాలా సున్నితంగా మారుతున్నారు. చిన్నవిషయాలకే ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read also :

academic pressure adolescent mental health family tragedy. Google News in Telugu Hyderabad crime Latest News in Telugu parental scolding Student suicide Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.