హైదరాబాద్ (సరూర్ నగర్) : ప్రేమించిన వ్యక్తి ప్రవర్తన నచ్చక మాట్లాడడం మానేసినా.. (HYD Crime) తననే పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేయడంతో జీవితంపై విరక్తి చెందిన బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్లోని(Hyderabad) అల్మాస్గూడలో జరిగింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఇన్స్పెక్టర్ శంకర్కుమార్ నాయక్ తెలిపిన ప్రకారం.. బాలాపూర్ మండలంలోని అల్మాస్ గూడ ఎస్ఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్న అశోక్, రూప దంపతుల కుమార్తె విహారిక (20) అబ్దుల్లాపూర్మెట్లోని విజాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతున్నది.
Read Also: Hyderabad Book Fair: బుక్ ‘ఫెయిర్’లోనూ అవకతవకలేనా?
ప్రేమికుడి వేధింపులు తాళలేక బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య
అల్మాస్గూడ రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన డెకరేషన్ పనులు చేసే కిశోర్ (32) ఆమెను ప్రేమించగా వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించారు. (HYD Crime)ఇదిలా ఉండగా కిశోర్ ప్రవర్తన నచ్చక విహారిక కొన్నిరోజులుగా అతనితో మాట్లాడడం మానేసింది. దీంతో కిశోర్ తనతో మాట్లాడాలనీ తననే వివాహం చేసుకోవాలని విహారికను ఫోన్ ద్వారా పదేపదే మెసేజ్ ద్వారా మానసికంగా ఒత్తిడి చేయడంతోపాటు వేధింపులకు గురిచేశాడు. అవమానించాడు. ఆమె కుటుంబాన్ని కూడా బెదరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విహారిక జీవితంపై విరక్తి చెందిన ఆదివారం రాత్రి పడక గదిలో సీలింగాఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య సమాచారం అందడంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న మీర్పేట్ పోలీసులు విహారిక మృతిపై విచారణ జరిపారు. కిశోర్ వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ శంకర్కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్ఐ జి.శ్రీనివాస్ డ్డి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: