హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(VC Sajjanar) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పిల్లల నిర్లక్ష్యం, నిరాదరణ కారణంగా వృద్ధులు ఒంటరితనం, భయంకర పరిస్థితుల్లో జీవించడాన్ని ఆయన తీవ్రంగా(HYD) వ్యతిరేకించారు. తాము పోలీస్ వ్యవస్థలో ఎన్నో సంవత్సరాలు పనిచేస్తూ, సైబరాబాద్, టీజీఎస్ఆర్టీసీ, ఇతర జిల్లాల్లో అనేక సందర్భాలను చూశానని, ప్రతిరోజూ వృద్ధుల సమస్యలతో వచ్చిన వందల మంది పిటిషనర్లను చూసినప్పుడు తన మనసు తీవ్రంగా కలత చెందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Read also: HYD: టిమ్స్ హాస్పిటళ్ల పనుల్లో వేగం పెంచాలి
వృద్ధుల పరిరక్షణలో పోలీస్ కమిషనర్ భరోసా
తల్లిదండ్రులను(HYD) చూసుకోవడం పిల్లల కర్తవ్యం మాత్రమే కాదు, అది ఒక మౌలిక జన్మహక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఈ కర్తవ్యం ఎటువంటి చర్చలకు, తర్కాలకు లోబడి ఉండరాదు. “ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తారో, రేపు అదే పాఠం మీ పిల్లలకు నేర్పబడుతుంది” అని సజ్జనార్ సూచించారు. వృద్ధులను వేధించడం, వదిలివేయడం వంటి ప్రవర్తనలను ఎటువంటి పరిస్థితిలోనూ సమాజం లేదా చట్టం అంగీకరించదని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఆయన భరోసా ఇచ్చారు. “మీరు ఒంటరి కారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సంకోచించకుండా నేరుగా నన్ను సంప్రదించవచ్చు. మీ ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సు కాపాడటం హైదరాబాద్ పోలీసుల బాధ్యత” అని ఆయన హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: