📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Telugu News: HYD: రైతులకు భారంగా కాంప్లెక్స్ రూ.100 వరకూ పెంపు

Author Icon By Sushmitha
Updated: November 28, 2025 • 1:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత రబీతో పోల్చితే రూ.430 పెరుగుదల

హైదరాబాద్: HYD రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులకు ఎరువుల సరఫరా ఒక సవాలుగా నిలుస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరతతో అష్టకష్టాలు పడ్డ రైతులకు ప్రస్తుత రబీపై ఆందోళన తప్పడం లేదు. ఈ రబీ సీజనులో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

 Read Also: R. Krishnaiah: 42 శాతం రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలు జరపాలి

HYD Complex hiked up to Rs.100, burdening farmers

ఎరువుల ధరల పెరుగుదల, ఆర్థిక భారం

గత ఖరీఫ్‌లోనే ఎరువుల ధరలు భారీగా పెరగ్గా, ఇప్పుడు ఈ రబీలోనూ మరోసారి పెరిగాయి. ఎరువుల రకాన్ని బట్టి ఒక్కో రకంపై రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగాయి. పెరిగిన ఎరువుల ధరలు రైతులకు ఆర్థికంగా మరింత భారం కానున్నాయి. తెలంగాణ రైతులపై వందలాది కోట్ల రూపాయల భారం పడుతున్నది. కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చూస్తే యాసంగిలోనే రైతులపై రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా.

గత ఖరీఫ్‌లోనే ఎరువుల ధరలను పెంచుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇప్పుడు యాసంగిలో మళ్లీ ధరలు పెంచారు. ఒక్కో ఎరువుపై ఏడాదిలోనే 15 నుంచి 30 శాతం వరకు ధరలు పెరగ్గంతో రైతులపై మోయలేని భారం అయింది. ఒక్కో రైతుపై సగటున ఒక పంటకు ఏడాదికి రూ.2 వేల నుండి రూ.3 వేల వరకు అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. గత యాసంగి ధరలతో పోలిస్తే ప్రస్తుతం ఒక్కో కాంప్లెక్స్ ఎరువు బస్తాపై రూ.150 నుంచి రూ.430 వరకు ధర పెరిగింది. యూరియా మినహా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదల చోటు చేసుకుంది.

వివిధ కాంప్లెక్స్ ఎరువుల ధరలు

డీఏపీ ధర ప్రస్తుతం పాత ధర 50 కిలోల బస్తాకు రూ.1,350 అలాగే ఉంది. మిగతా ఎరువుల బస్తాలపై రూ.25 నుంచి రూ.100 వరకు పెరిగాయి.

యాసంగిలో కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. దీంతో రైతులకు అదనంగా కోట్ల రూపాయల భారం పడుతోంది.

రబీ సీజన్ సాగు అంచనాలు, ఎరువుల అవసరాలు

ప్రస్తుత రబీ సీజనులో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా సాధారణ విస్తీర్ణం 63.55 లక్షల ఎకరాలు కాగా, 80 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా. ఈ రబీలో సాగు కోసం అన్ని రకాల ఎరువులు కలిపి దాదాపు 19.60 లక్షల టన్నుల వరకూ అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా 9.8 లక్షల టన్నుల యూరియా, 1.6 లక్షల డీఏపీ, 7 వేల టన్నుల ఎంపీపీ, కాంప్లెక్స్ 7 వేల టన్నులు, ఎంఎస్పీ 6 వేల టన్నులు చొప్పున అవసరం అవుతుందని లెక్కకట్టారు. ఈ నేపథ్యంలో పెరిగిన ఎరువుల ధరలు మరింత ఆర్థిక భారం అయిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

agricultural costs complex fertilizers price hike DAP Urea prices. farmer burden Google News in Telugu Latest News in Telugu Rabi Season Telangana fertilizers Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.