హైదరాబాద్ నగరంలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి అలర్ట్. ఇకపై తమ నిర్మాణ సామగ్రిని ఇష్టానుసారం రోడ్లపై పడేసి సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో రహదారి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా.. పాదచారులు, వాహనదారుల భద్రతను కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ చట్టంలో కీలక సవరణలకు రంగం సిద్ధం చేసింది. (HYD) నిర్మాణ సామగ్రిని రోడ్లపై వేయడం, విక్రయించడంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ కఠినమైన జరిమానాలు, జైలు శిక్ష పడేలా కొత్త నిబంధనలను తీసుకురాబోతోంది. రేపోమాపో ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Read also: TG: నన్ను చంపండి..మీడియా కథనాలపై కోమటరెడ్డి ఆవేదన
జీహెచ్‌ఎంసీ చట్టంలో కఠిన నిబంధనలు అమలు
(HYD) నగర జీవనాన్ని సులభతరం చేసే లక్ష్యంతో జూలై 15, 2025న ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో ఈ సవరణలపై నిర్ణయాలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ చట్టంలోని వివిధ ఆర్టికల్స్ ప్రకారం రహదారులు, కాలిబాటలపై ఇసుక, ఇటుకలు, కంకర, మట్టి వంటి నిర్మాణ సామగ్రిని నిల్వ చేయడం లేదా అమ్మడం నేరంగా పరిగణించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రభుత్వం భారీ జరిమానాలు విధించనుంది. నిర్మాణ వ్యర్థాలను అనుమతి లేకుండా తరలించే వాహనాలకు మొదటి తప్పిదంగా రూ. 1 లక్ష జరిమానా విధిస్తారు. ఒకవేళ ఆ వ్యర్థాలను చెరువులు, నాలాలు, కాలిబాటలు లేదా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే జరిమానాను రెట్టింపు చేస్తారు. ఒకే వ్యక్తి లేదా సంస్థ రెండోసారి అంతకంటే ఎక్కువసార్లు ఇటువంటి తప్పులకు పాల్పడితే.. జరిమానా మొత్తాన్ని రూ. 5 లక్షలకు పెంచడంతో పాటు ఏడాది పాటు జైలు శిక్ష పడేలా చట్టంలో సవరణలు చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: