📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HYD: కూకట్ పల్లిలో ఎసిబి దాడులు.. సూపరింటెండెంట్ ఇంజినీర్ అరెస్ట్

Author Icon By Saritha
Updated: February 5, 2026 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (మూసాపేట్) : (HYD) కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు తీవ్రంగా చర్చనీయాంశమవుతున్న సమయంలో, ఎసిబి (ACB) అధికారులు జరిపిన దాడులు సంచలనంగా మారాయి. ప్రభుత్వ పనుల బిల్లుల విడుదల పేరుతో భారీ లంచం డిమాండ్ చేసిన సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.చిన్నారెడ్డి ఎసిబి ఉచ్చులో చిక్కాడు. బుధవారం కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో చిన్నారెడ్డి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు.

Read Also: ACB Raids Hyderabad: కాసులిస్తేనే సరి .. లేదంటే కిరికిరి

ACB raids in Kukatpally Superintendent Engineer arrested.

కోట్ల బిల్లుల విడుదలకు రూ.30 లక్షల లంచం

(HYD) రంగారెడ్డి రేంజ్ ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి జోనల్ పరిధిలో అల్వాల్, కూకట్పల్లి, మూసాపేట్ సర్కిళ్లలో చెరువుల పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టిన ఓ కాంట్రాక్టర్కు సంబంధించి రూ.1 కోటి 40 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్లులు విడుదల చేయాలంటే మొదట రూ.40 లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసిన చిన్నారెడ్డి, అనంతరం రూ.30 లక్షలకు తగ్గేది లేదని స్పష్టం చేసినట్లు కాంట్రాక్టర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒకేసారి అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో, విడతల వారీగా చెల్లించేందుకు కాంట్రాక్టర్ అంగీకరించాడు.

ఫిర్యాదు మేరకు పథకం రచించిన ఎబిసి అధికారులు, బుధవారం తొలి విడతగా రూ.15 లక్షలను చిన్నారెడ్డి తరఫున కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్న ప్రవీణ్ చేతికి అందజే స్తున్న సమయంలో రెడ్ హ్యాం డెడ్గా పట్టు కున్నారు. ఈ కేసులో చిన్నా రెడ్డితోపాటు మధ్యవర్తుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రంగారెడ్డి రేంజ్ ఎసిబి డిఎస్పీ ఆనంద్కుమార్ వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

acb raids Bribery Case Corruption Allegations Google News in Telugu hyderabad kukatpally Moosapet Superintendent Engineer Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.