📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Latest News: HYD: తెలంగాణలో కొత్త హైకోర్టు

Author Icon By Saritha
Updated: December 18, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాజేంద్రనగర్లో(HYD) నిర్మాణంలో ఉన్న కొత్త హైకోర్టు భవన సముదాయం పనుల పురోగతిని రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ బుధవారం పరిశీలించారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజినీర్లు (బిల్డింగ్స్, ఎలక్ట్రికల్), ఆర్అండ్్బ ఫీల్డ్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్ సంస్థ డీఈసీ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, కన్సల్టెంట్లు టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు పాల్గొన్నారు. పనుల వేగం, క్రమబద్ధత, నాణ్యతను వికాస్ రాజ్ సమీక్షించి, వివిధ దశల పూర్తి కాలపట్టి కలను ఖరారు చేశారు.

Read also: Telangana: సర్పంచ్ ఎన్నికల్లో ‘జగన్ పై చంద్రబాబు’ విజయం!

A new High Court in Telangana.

రూ.2,583 కోట్లతో ప్రాజెక్టు

తెలంగాణ(Telangana) ప్రభుత్వ(HYD) ప్రతిష్టాత్మక న్యాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కొత్త హైకోర్టు భవన సముదాయానికి రూ.2,583 కోట్ల పరిపాలనా అనుమతి ఉంది. మొత్తం 36.52 లక్షల కోట్లు, చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. ఇందులో సివిల్, ఎలక్ట్రికల్, ఎంఈపీ పనులకు రూ.1,980 ఫర్నిచర్, ఆపరేటివ్ పరికరాలకు రూ.603 కోట్లు కేటాయించారు. 2024 డిసెంబర్ 7న జారీ చేసిన జీఓ ఆర్టీ నెం.827 ద్వారా పరిపాలనా ఆమోదం లభించింది. పనుల సమీక్షలో భాగంగా, డ్రాయింగ్లను ముందుగానే సమర్పిం చాలని కన్సల్టెంట్లను వికాస్ రాజ్ ఆదేశించారు. తద్వారా కార్మికులు, సామగ్రి, యంత్రాల సమర్థ వినియోగం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. పనుల పూర్తి కార్యక్రమాన్ని చీఫ్ ఇంజినీర్ (బిల్డింగ్స్), కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ కలిసి రూపొందించాలని, దానిపై తరచూ సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఒప్పందంలో పేర్కొన్న మైలురాళ్ల ప్రకారం పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. న్యాయ అధికారుల సూచనలకు అనుగుణంగా మార్పు చేసిన నమూనాలను ఆలస్యం లేకుండా సిద్ధం చేసి, అనుమతులు పొందాలని లని కన్సల్టెంట్లకు ఆదేశించారు. జోన్2కు సంబంధించిన అటవీ అనుమతులు సహా అన్ని క్లియరెన్సులను త్వరితగతిన పూర్తిచేయాలని చీఫ్ ఇంజినీర్ (బిల్డింగ్స్)కు సూచించారు. డిజైన్ మార్పుల వల్ల ఏర్పడిన ఆలస్యాలను అధిగమించేందుకు ఆర్ అండ్ బి శాఖ, కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ సమన్వ యంతో పనిచేయాలని, ప్రాజెక్టును సమయానికి పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

government buildings Hyderabad Development Judicial Infrastructure Latest News in Telugu Rajendranagar Project telangana government Telangana High Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.