వరంగల్ (Warangal) నగరంలో కొలువైన భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చే కల్పవల్లిగా అమ్మవారికి ప్రసిద్ధి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చి, తమ శక్తిమేర కానుకలు సమర్పిస్తారు. ఈ క్రమంలో (HYD) తాజాగా ఒక కుటుంబం భద్రకాళి అమ్మవారికి అత్యంత విలువైన కానుకను సమర్పించింది. 111 కేజీల వెండి కవచాన్ని అమ్మవారికి విరాళంగా అందజేసింది.
Read Also: Sammkka Saralamma: మేడారం జాతరలో భక్తులపై పోలీసుల దాడి..
సుమారు 4.5 కోట్లు ఖర్చు అయిన వెండి కవచం
హైదరాబాద్‌కు (HYD) చెందిన భక్తులు పుట్టంరెడ్డి ప్రతాప్ రెడ్డి, వెంకటలక్ష్మి, దీప్తి రెడ్డి ఈ భారీ కానుకను సమర్పించి వార్తల్లో నిలిచారు. భద్రకాళి అమ్మవారికి 111 కేజీల వెండితో తయారు చేసిన సర్వాంగ కవచాన్ని వీరు విరాళంగా అందించారు. ఈ వెండి కవచం తయారీకి సుమారు 4.5 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ కవచంతో పాటు మరో 21 ఆభరణాలను సదరు హైదరాబాద్ భక్తులు భద్రకాళి దేవస్థానం ఈవో సునీతకు అందజేశారు. అనంతరం పూజారులు వారి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులు సమర్పించిన ఈ వెండి కవచాన్ని పర్వదినాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించే రోజుల్లో అమ్మవారికి అలంకరిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: