Hussain Sagar: హైదరాబాద్‌లోని (Hyderabad) ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ట్యాంక్‌బండ్‌పై ఒక విషాదకర ఘటన వెలుగు చూసింది. కుటుంబ సమస్యలతో విసిగిపోయిన ఒక మహిళ తన ఇద్దరు చిన్నారి కుమారులతో కలిసి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, గస్తీలో ఉన్న పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Read also: Amberpet Crime: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య!
జియాగూడ ఎంసీహెచ్ కాలనీకి చెందిన బి. ప్రతివ (28) అనే మహిళకు తన భర్తతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె, తన కుమారులు అనిష్ (10), జస్వంత్ (7)లను తీసుకుని ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. తెలంగాణ అమరవీరుల స్థూపం సమీపంలో వారు అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని అక్కడి పోలీసులు గమనించారు.
విచారణలో, కుటుంబంలో భర్తతో తరచూ గొడవలు జరుగుతున్నాయని, దీంతో విసిగిపోయి పిల్లలతో కలిసి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు వెంటనే వారిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ ఎ. సీతయ్య ఆమెకు ధైర్యం చెప్పి, ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని కౌన్సెలింగ్ ఇచ్చారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ముగ్గురి ప్రాణాలు నిలిచాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: