📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Husnabad Municipal Controversy: మున్సిపల్ కార్యాలయంలో వివాదం…!

Author Icon By Pooja
Updated: March 11, 2026 • 5:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Husnabad Municipal Controversy: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం సందర్భంగా చిన్న వివాదం చోటుచేసుకుంది. 18వ వార్డు కౌన్సిలర్ వాల సుప్రజ భర్తను చైర్‌పర్సన్ దండి లక్ష్మి కొమురయ్య అవమానించారని కౌన్సిలర్ ఆరోపించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశంతో పాటు నూతనంగా నియమితులైన పాలకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన కౌన్సిలర్ వాల సుప్రజను ఆమె భర్త నవీన్ రావు కార్యాలయం వద్ద దింపేందుకు వచ్చారు.

Read Also:Kalvakuntla Kavitha: రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత


ఈ సందర్భంగా కౌన్సిలర్ సుప్రజ తన భర్తను కొత్తగా బాధ్యతలు స్వీకరించిన చైర్‌పర్సన్‌కు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పడంతో ఇద్దరూ కలిసి చైర్‌పర్సన్ చాంబర్‌లోకి వెళ్లారు. అయితే అక్కడ చైర్‌పర్సన్ దండి లక్ష్మి కొమురయ్య కౌన్సిలర్ మాత్రమే లోపలికి రావాలని చెప్పి తన భర్తను అవమానించారని సుప్రజ ఆరోపించారు. తన భర్తను మున్సిపల్ కార్యాలయంలోకి రావద్దని చెప్పిన చైర్‌పర్సన్, తన భర్తను మాత్రం చాంబర్‌లో ఉంచి ఫోటోలు దిగడం ఎలా సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంపై హుస్నాబాద్‌లో విలేకరుల ఎదుట ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్ సుప్రజ బడ్జెట్ ఆమోదానికి చేయి కూడా లేపలేదు. దీనిని గమనించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం ముగిసిన తర్వాత “బడ్జెట్ నచ్చలేదా?” అంటూ చమత్కారంగా ప్రశ్నించారు. అయితే కౌన్సిలర్ సుప్రజ స్పందించలేదు.


తరువాత నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొనకపోవడంతో విషయం గమనించిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా కౌన్సిలర్‌కు ఫోన్ చేసి తిరిగి కార్యాలయానికి రప్పించి మాట్లాడి నచ్చజెప్పినట్లు తెలిసింది. ఈ ఘటన హుస్నాబాద్ మున్సిపల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మున్సిపల్ పాలకవర్గం అంతా సమన్వయంతో కలిసి పని చేస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Husnabad News Municipal Budget Meeting ponnam prabhakar Telangana Politics News.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.