📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Drugs : విద్యాసంస్థల వద్ద డ్రగ్స్ బానిసల కోసం వేట

Author Icon By Shravan
Updated: August 13, 2025 • 2:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Drugs : రాష్ట్రంలో డ్రగ్స్ స్మగర్ల భరతం పట్టేందుకు తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ఈగల్ (Anti-Narcotics Bureau) టి.జాబ్ కొత్త ఎత్తుగడలను ఎంచుకుంది. ఇప్పటి వరకు మాదకద్రవ్యాల స్మగర్లను పట్టుకునేందుకు ఇన్ఫార్మర్ వ్యవస్థను వాడిన ఈగల్ పోలీసులు ఇప్పుడు వీరి మూలంగా విద్యా సంస్థల్లో చదువుకుంటూ బానిసలుగా మారిన విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు. వ్యసనపదుల వివరాలను పక్కాగా సేకరించి వారిని వరుసగా పట్టుకుంటూ వారు వెల్లడించే సమాచారం ఆధారంగా స్మగర్ల భరతం పడుతున్నారు. మరోవైపు ఈగల్ దాడుల్లో పట్టుబడుతున్న వ్యసనపరుల్లో ప్రారంభ దశలో వున్న వారికి కౌన్సిలింగ్తో సరిపుచ్చుతున్న అధికారులు వీటికి కానిసలుగా మారిన వారినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ స్పెషల్ ఆపరేషన్ను మరింత పక్కాగా అమలు చేయాలని ఈగల్ పోలీసులు నిర్ణయించారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను ఈగల్ పోలీసులు డ్రగ్స్ స్మగర్లను పట్టుకునేందుకు అనుసరిస్తున్నారు. మామూలుగా మాదకద్రవ్యాల స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులతో పాటు అబ్కారీ శాఖ ఇన్ఫార్మర్ వ్యవస్థతో పాటు పాత నేరగాళ్ల నుంచి అందే సమాచారం, అనుమానిత ప్రాంతాలలో ఆకస్మిక దులు నిర్వహించడం పరిపాటిగా వుండడం తెలిసిందే. దీనివల్ల కేవలం మాదకద్రవ్యాల క్రయ, విక్రేతలు మాత్రమే పట్టుబడుతున్నారు. అయితే ఇదే సమయంలో వీరి కారణంగా వ్యసనపరులుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీ విద్యార్థులు ఎక్కువగా వుంటున్నారు. ఒకడు అరెస్టయితే వాడితో పరిచయం వున్న మరో నేరగాడు అందుబాటులోకి వస్తుండడంతో వ్యసనపరులుగా మారిన విద్యార్థులు తమకు కావాలసిన సరుకును నిమిషాల్లో సమకూర్చు కుంటున్నారు.

దీనివల్ల ఎన్నో కుటుంబాలు నాశనపప్పుతున్నాయి

ఈ నేపథ్యంలోనే ఈగల్ పోలీసులు ఉవైపు మారకద్రవ్యాల భరతం వడుతూనే మరోవైపు వ్యసనపరుల్లో మార్పు తెచ్చేందుకు తమవంతు గా ప్రయత్నాలు చేయసాగారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలతో పాటు అనేక ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు కొనేళ్లుగా డ్రగ్స్ మాఫియా ఉచ్చులో చిక్కుకు పోయాయని ఈగల్ గుర్తించింది. గంజాయి సహా కొకైన్, హెరాయిన్, సింథటిక్ డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్న వారిలో కాలేజీ విద్యార్థులే ఎక్కువగా వుంటున్నారని అనేకమార్లు తేలింది. పోలీసులతో పాటు అబ్యార్ శాఖ అధికారుల దాడుల్లో పట్టుబడిన వ్యసనరుల్లో విద్యార్థుల సంఖ్య భారీగానే వుంటోంది. టీనేజి విద్యార్థులు కూడా ఇందులో వుండడం గమనార్హం, కాలేజిల్లో డ్రగ్స్, సపియా తిష్టను పారదోలాలని నర్కారు కృతనిశ్చయంతో వుండడంతో ఈగల్ పోలీసులు స్పెషల్ అపరేషన్ లేబట్టారు. ఇటీవల కాలంలో ఈగల్ పోలీసులు పక్కాగా వ్యవహరించి కాలేజీలను టార్గెట్ చేసుకుని అక్కడ డ్రగ్స్ కు బానిసలుగా మారిన వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటూ వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇ సూరే చట్ట పరంగా చర్యలు తీసుకుంటున్న తీరు సంచలనం రేవుతోంది. డ్రగ్స్ కు ఎక్కువగా బానిసలుగా మారిన వారిని ఈగల్ పోలీసులు పునరావాస కేంద్రాలకు పంపు తు వారికి కొత్త జీవితాలను ఇస్తున్నారు. ఇదే సమయంలో ఈగల్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ విద్యా సంస్థల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సికింద్రాబాద్లో ఇటీ వల కాలేజీ వద్ద గంజాయి వ్యసనపరులను ఈగల్ పోలీసులు చార్లెట్ చేయగా కొందరు విద్యార్థులు పట్టులు డ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు స్మగ్లర్లు కూడా దొరికిపోయారు.

ఏదాది క్రితం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ వద్ద నిర్వహించిన దారుల్లో ఏకంగా ఇద్దరు ఎంబిబిఎస్ విద్యార్థులు గంజాయి కొంటూ దొరికిపోయారు. వైద్య విద్యార్థులు గంజాయి స్మగర్ల నుంచి గంజాయి కొంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం ఇదే తొలిసారి. కాగా ఉప్మానియా మెడికల్ కాలేజిలో ఇద్దరు వైద్య విద్యార్థులు గంజాయి కొంటూ దొరికిపోయిన ఘటన కాలేజీలో రగడకు దారితీసింది. పట్టుబడ్డ ఇద్దరు తమ కాలేజీ పూర్వ విద్యార్థులని, వారికి తమ కాలేజితో సంబంధం లేదని అధికారులు చెబుతుండగా పూర్వ విద్యార్థులు కాలేజిలో గంజాయి స్మగ్లర్ల నుంచి గంజాయి కొనవచ్చా….? అని పోలీసులు ప్రశ్నించారు. వైద్య విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారితే భవిష్యత్తులో వారు వైద్య వృత్తిని ఎలా కొనసాగించగలరనే పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఉప్మానియా మెడికల్ కాలేజిలో వైద్య విద్యార్థులు గంజాయితో దొరికిపోయిన ఘటన వైద్య విద్య విభాగంలో కలకలం రేపింది. రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజిలను (Engineering and medical colleges) లక్ష్యంగా చేసుకుని ఈగల్ పోలీసులు వరుసగా దాడులు చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాడు. విద్యార్థులు డ్రగ్స్ కల్చర్ నుంచి పూర్తిగా బయటపడేందుకు, వారిలో మార్పు తెచ్చేందుకు మొదట పునరావాస కేంద్రాలకు తరలించి, ఆ తరువాత వారిలో మార్పు తెచ్చేందుకు చర్యలు చెబట్టేందుకు ఈగల్ నిర్ణయించింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/rs-600-crore-chicken-egg-scam-in-the-state/telangana/529812/

anti-drug campaign Breaking News in Telugu drugs in campus Latest News in Telugu school safety Student Safety Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.