Ganja Seized Telangana: భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత

Read Time:  1 min
Ganja Seized Telangana: భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత
FONT SIZE
GET APP

Ganja Seized Telangana: తెలంగాణలో మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ముఠా ఆట కట్టించారు. జూలూరుపాడు మండల కేంద్రంలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.52 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Kalvakuntla Kavitha: కేసీఆర్, కేటీఆర్‌లపై కవిత యుద్ధం!

పక్కా సమాచారంతో మెరుపు దాడి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాహనాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో సుమారు 105.54 కిలోల గంజాయిని కార్లలో గుర్తించారు.జూలూరుపాడు పోలీసులు, సీసీఎస్ (CCS) సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. వాహనాల్లో గంజాయి తరలుతోందన్న పక్కా సమాచారంతో జూలూరుపాడు శివారులో నిఘా పెట్టారు.

Huge amount of ganja seized in Bhadradri
Huge amount of ganja seized in Bhadradri

టీఎస్11 ఈఆర్ 6312, టీఎస్07 జేవై 3959 అనే నెంబర్లతో కూడిన రెండు కార్లను పోలీసులు ఆపారు. ఆ కార్లలో సోదాలు చేయగా దాచి ఉంచిన 52 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. కార్లలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కలిమెల, డొంకరాయి ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు వారు పోలీసులకు తెలిపారు.

ఈ గంజాయిని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం మీదుగా హైదరాబాద్‌కు తరలించి విక్రయించాలని ప్రయత్నించినట్లు తెలిపారు.అరెస్టైన ముగ్గురిని నల్గొండ జిల్లాకు చెందిన శివాకర్ ప్రమోద్ కుమార్ (35), బైరెడ్డి భార్గవ్ (30), రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంకు చెందిన అందేకర్ శ్రీనివాస్ (40)లుగా గుర్తించారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు రెండు కార్లు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అభి, లక్ష్మణ్, ఫరూక్ అనే ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.